ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహారం కోర్టులో నడుస్తోంది. విచారణ మొదలవ్వలేదు. వాదనలు ఇంకా ప్రారంభం కాలేదు. ఫిర్యాదులు, ప్రతిపిర్యాదులు (petitions & counter petitions) దశలోనే ఉంది. ఈ దశలోనే మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం నాడు తాను దాఖలు చేసిన పిటిషన్ లో చాలా అభ్యంతరకర అంశాలు లేవనెత్తారు. “ఎన్నికల వాయిదా నిర్ణయం గోప్యమైనదని, సంప్రదింపులు అవసరం లేదని” నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. […]