ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన ఒలింపిక్ గేమ్స్‌ను కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించడంతో వాయిదా పడిన విషయం విదితమే. టోక్యోలో ఈ సంవత్సరం జూలై 23 నుండి ఆగస్టు 8 వరకూ జరగాల్సిన ఒలింపిక్స్ ను సంవత్సరం పాటు వాయిదా వేస్తూ, 2021 జులై 23 నుంచి నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం నిర్ణయించింది. ఒకవేళ కరోనా మహమ్మారి వచ్చే ఏడాదికి కూడా నియంత్రణలోకి రాకపోతే ఒలింపిక్స్‌ను రద్దు చేస్తామని టోక్యో గేమ్స్ 2020 అధ్యక్షుడు యోషిరో మోరీ స్పష్టంచేశారు. […]