iDreamPost

సమ్మర్ హాలిడేస్ వచ్చేశాయ్.. మొత్తం ఎన్ని రోజులంటే?

విద్యార్థులకు గుడ్ న్యూస్. పాఠశాలలకు వేసవి సెలవులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా ఈసారి ఎన్ని రోజులు సమ్మర్ హాలిడేస్ ఉండనున్నాయంటే?

విద్యార్థులకు గుడ్ న్యూస్. పాఠశాలలకు వేసవి సెలవులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా ఈసారి ఎన్ని రోజులు సమ్మర్ హాలిడేస్ ఉండనున్నాయంటే?

సమ్మర్ హాలిడేస్ వచ్చేశాయ్.. మొత్తం ఎన్ని రోజులంటే?

ఎండాకాలం ప్రారంభమైందంటే చాలు విద్యార్థుల్లో ఓ రకమైన సంతోషం వ్యక్తమవుతుంటుంది. ఎందుకంటే స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తారు కాబట్టి. సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు.. రోజూ స్కూల్ కు వెళ్లేది ఉండదు.. హోం వర్క్స్ టెన్షన్ ఉండదు. ఇంటిపట్టునే ఉండి కావాల్సినంతా సేపు ఆడిపాడొచ్చు అని విద్యార్థులు తెగ సంబరపడిపోతుంటారు. అమ్మమ్మ ఊళ్లకు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు తల్లిదండ్రులను ఒప్పిస్తుంటారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించనున్నాయి ప్రభుత్వాలు. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వేసవి సెలవులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దాదాపు అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనాలు బయట అడుగు పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇక ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒంటిపూట బడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవగా.. ఏప్రిల్ 23తో ముగియనున్నాయి. ఆ తర్వాత రోజు నుంచి అంటే ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రీఓపెన్ అవుతాయని అధికారులు చెబుతున్నారు.

Summer holidays have arrived for schools

ఈసారి తెలంగాణలో 45 రోజులకు పైగా వేసవి సెలవులు రానున్నాయి. ఎండల తీవ్రతను బట్టి వేసవి సెలవులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏప్రిల్ 24వ తేదీ నుంచి స్కూల్స్ వేస‌వి సెల‌వులు ప్రారంభం కానున్నాయి. అయితే 2024 జూన్ 13వ తేదీ వ‌రుకు ఈ వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. అంటే దాదాపు స్కూల్స్‌కి 50 రోజులు పాటు ఈ సారి వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి