iDreamPost

వీడియో: ‘అర్జున్ రెడ్డి’ మ్యూజిక్ డైరెక్టర్​పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్.. బతికిపోయాడంటూ..!

  • Published Feb 22, 2024 | 4:14 PMUpdated Feb 22, 2024 | 4:14 PM

టాలీవుడ్ కల్ట్ ఫిల్మ్ ‘అర్జున్ రెడ్డి’కి సాంగ్స్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్​ రధన్​పై ఒక దర్శకుడు సీరియస్ అయ్యారు. చెన్నైలో ఉన్నాడు కాబట్టి ఆయన బతికిపోయాడని అన్నారు.

టాలీవుడ్ కల్ట్ ఫిల్మ్ ‘అర్జున్ రెడ్డి’కి సాంగ్స్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్​ రధన్​పై ఒక దర్శకుడు సీరియస్ అయ్యారు. చెన్నైలో ఉన్నాడు కాబట్టి ఆయన బతికిపోయాడని అన్నారు.

  • Published Feb 22, 2024 | 4:14 PMUpdated Feb 22, 2024 | 4:14 PM
వీడియో: ‘అర్జున్ రెడ్డి’ మ్యూజిక్ డైరెక్టర్​పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్.. బతికిపోయాడంటూ..!

ప్రతి పరిశ్రమలోనూ లోగుట్లు, గొడవలు చాలానే ఉంటాయి. ఒకే దగ్గర పని చేస్తున్న వారి మధ్య మనస్పర్థలు, ఫైట్స్ కామనే. అందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా మినహాయింపేమీ కాదు. చిత్ర పరిశ్రమలో పని చేసే టెక్నీషియన్స్, యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మధ్య గొడవలు సాధారణమే. అయితే అక్కడి గొడవల్ని బయట పెట్టుకునే సందర్భాలు మాత్రం తక్కువే. చాలా మటుకు విషయాలు బయటకు రాకుండా లోలోపల సర్దుకోవడం ఎక్కువ. అలాంటిది ఓ డెబ్యూ డైరెక్టర్ పేరున్న ఓ సంగీత దర్శకుడి మీద ఓపెన్​గా నెగెటివ్ కామెంట్స్ చేయడం ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వస్తున్న ‘సిద్ధార్థ్ రాయ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ చిత్ర దర్శకుడు యశస్వి ఓపెన్ అయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్‌‌ రధన్ మీద ఆయన సీరియస్ అయ్యారు. బతికిపోయాడంటూ లైవ్​లో అందరి ముందు వార్నింగ్ ఇచ్చారు.

‘సిద్ధార్థ్ రాయ్’ సినిమా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం మ్యూజిక్ డైరెక్టర్ రధన్ అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు దర్శకుడు యశస్వి. చెన్నైలో ఉంటాడు కాబట్టి సరిపోయిందని.. హైదరాబాద్​లో ఉంటే చాలా గొడవలు జరిగేవంటూ హెచ్చరించారు. దీంతో ఆ ఈవెంట్​కు వచ్చిన వాళ్లందరూ షాకయ్యారు. తనలా ఎవరూ మోసపోకూడదన్నారు యశస్వి. ఆయనలో అంత టాలెంట్ ఉన్నా, గొప్ప టెక్నీషియన్ అయినా ఇంతగా వేధించడం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. ఒకసారి ఆర్గుమెంట్స్ చేస్తూ రాజమండ్రి నుంచి వైజాగ్ దాకా కారులో వెళ్లిపోయానని.. అంతగా ఇబ్బంది పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. రధన్​పై డైరెక్టర్ యశస్వి చేసిన విమర్శలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘అర్జున్ రెడ్డి’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’, ‘పాగల్’ వంటి సక్సెస్​ఫుల్ మూవీస్​కు బాణీలు అందించారు రధన్. ఆయన మీద ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే ఫస్ట్ టైమ్. సెన్సిటివ్ స్టోరీస్​తో తెరకెక్కే సినిమాలకు, లవ్ స్టోరీస్​కు మంచి ట్యూన్స్ ఇస్తాడని రధన్​కు ఇండస్ట్రీలో పేరుంది. మనసుకు హత్తుకునేలా బాణీలను సమకూర్చడంలో ఎక్స్​పర్ట్​గా గుర్తింపు సంపాదించారు రధన్. ఆయనతో పని చేసేందుకు యంగ్ డైరెక్టర్స్​తో పాటు స్టార్ హీరోలు, ప్రముఖ దర్శకులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటిది ఆయనపై యశస్వి విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కాంట్రవర్సీపై ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎలా రియాక్డ్ అవుతారో చూడాలి. మరి.. దర్శకుడు యశస్వి-మ్యూజిక్ డైరెక్టర్ రధన్ వివాదం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ బాలీవుడ్ హారర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన యానిమల్ బ్యూటీ తృప్తి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి