iDreamPost
android-app
ios-app

ఆ బాలీవుడ్ హారర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన యానిమల్ బ్యూటీ తృప్తి!

  • Published Feb 22, 2024 | 2:30 PM Updated Updated Feb 22, 2024 | 2:30 PM

యానిమల్ భామ తృప్తి దిమ్రి ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీలో మారు మోగుతోంది. యానిమల్ తర్వాత తృప్తికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ మరో కొత్త సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇంతకి ఆ సినిమా అంటే..

యానిమల్ భామ తృప్తి దిమ్రి ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీలో మారు మోగుతోంది. యానిమల్ తర్వాత తృప్తికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ మరో కొత్త సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇంతకి ఆ సినిమా అంటే..

  • Published Feb 22, 2024 | 2:30 PMUpdated Feb 22, 2024 | 2:30 PM
ఆ బాలీవుడ్ హారర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన యానిమల్ బ్యూటీ తృప్తి!

బాలీవుడ్ హీరోయిన్ తృప్తి ‘దిమ్రి’. ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీలో మారు మోగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ నటించిన ‘యానిమల్’ మూవీలో నటించి సంచలనం సృష్టించింది. ఈ సినిమా తన ఆద్భుతమైన నటనతో కుర్రకారుల మతి పొగొట్టింది. అయితే యానిమల్ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటు.. ఇందులో నటించిన తృప్తి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి వరుస అవకాశాలునేవి క్యూ కడుతున్నాయి. ఇప్పటికి ఆషికీ-3 ఫ్రాంచైజీతో పాటు పలు సినిమాల్లో ఆవకాశాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ అమ్మాడు మరో లక్కీ ఛాన్స్ ను కొట్టేసింది. ఏకంగా ఆ స్టార్ పక్కన నటించే ఆవకాశం దక్కించుకుంది. ఇంతకి ఎవరితో అంటే..

‘యానిమల్’ మూవీతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా యంగ్ హీరోయిన్ తృప్తి దిమ్రి ఎంతో క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంది తృప్తి. అయితే ఇదే జోష్ లో తృప్తికి వరుస క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా తృప్తికి కార్తీక్ అర్యన్ సరసన ‘భూల్ భులాయ్యలో’ నటించే అవకాశాన్ని ఆమె సొంతం చేసుకుంది. అయితే ఇది సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా.. జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘చంద్రము’ఖి సినిమాకు రీమేక్ గా రూపొందించనున్నారు. కాగా, చంద్రముఖి సినిమా తమిళ్, తెలుగు భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కనుక ఈ చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ‘భుల్ భులయ్యా’ పేరుతో రీమేక్ చేశారు. అంతేకాకుండా.. ఈ సినిమాకు సీక్వెల్ గా, కార్తీక్ ఆర్యన్ హీరోగా ‘భుల్ భులయ్యా-2’ పేరుతో కూడా రిలీజ్ చేశారు. కాగా, ఇప్పుడు తాజాగా ‘భూల్ భులయ్యా -3’ కొత్తగా తెరకెక్కిస్తున్నారు. అందులో తృప్తి దిమ్రి నటిస్తున్నట్లు ఈరోజు అధికారికంగా ప్రకటన చేశారు. అలాగే ‘వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ భూల్ భులయ్యా’ అంటూ తృప్తి దిమ్రికి స్వాగతం పలికారు హీరో కార్తిక్ ఆర్యన్. దీంతో పాటు ‘ఆమె చిరునవ్వు ఎంతో మంది గుండెల్లో భయం కలిగిస్తుంది. తృప్తి రాకతో థ్రిల్స్, చిల్స్ మరింత పెరుగుతాయి’. అని టీ సిరీస్ పేర్కొంది.

ఇక ‘భూల్ భులయ్యా -3’ చిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక అక్షయ కుమార్ భుల్ భులయ్యా సినిమాలో (తెలుగులో జ్యోతిక పాత్రలో) విద్యా బాలన్ నటించారు. అయితే కార్తీక్ ఆర్యన్ నటించిన సీక్వెల్ లో టబు ఆ పాత్రలో నటించగా.. కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటించారు. కాగా, ఇప్పుడు భుల్ భులయ్యా 3 లో వచ్చేసరికి మళ్లీ విద్యా బాలన్ ను తీసుకున్నారు. అలాగే ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది. మరి, తృప్తి ఈ సినిమాలో తృప్తి లక్కీ ఛాన్స్ కొట్టేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss