iDreamPost

Siddharth-Aditi Rao Hydari: పెళ్లి వార్తలపై ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్​!

  • Published Mar 28, 2024 | 7:13 PMUpdated Mar 28, 2024 | 7:13 PM

హీరోయిన్ అదితి రావు హైదరీతో పెళ్లి వార్తలపై సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చారు. ఒక్క ఫొటోతో అసలు ఏం జరుగుతోందో చెప్పేశారు.

హీరోయిన్ అదితి రావు హైదరీతో పెళ్లి వార్తలపై సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చారు. ఒక్క ఫొటోతో అసలు ఏం జరుగుతోందో చెప్పేశారు.

  • Published Mar 28, 2024 | 7:13 PMUpdated Mar 28, 2024 | 7:13 PM
Siddharth-Aditi Rao Hydari: పెళ్లి వార్తలపై ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్​!

సెలబ్రిటీల పర్సనల్ లైఫ్​కు సంబంధించిన వార్తలపై ఆడియెన్స్, ఫ్యాన్స్​ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఫిల్మ్ స్టార్స్ విషయంలో ఈ ఆసక్తి మరింత అధికంగా ఉంటుంది. వాళ్లు ఎవర్ని పెళ్లి చేసుకుంటారు? ఎవర్ని ప్రేమిస్తున్నారు? లాంటి విషయాలకు సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా మరో హీరో మ్యారేజ్ టాపిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హీరో సిద్ధార్థ్​ మ్యారేజ్ చేసుకున్నారనే వార్త నెట్టింట మార్మోగుతోంది. హీరోయిన్ అదితి రావు హైదరీని ఆయన సీక్రెట్​గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే వీటి మీద ఈ జంట రియాక్ట్ అయ్యారు. ఒకే ఒక్క ఫొటోతో మ్యారేజ్ రూమర్స్​ అన్నింటికీ క్లారిటీ ఇచ్చేశారు.

వివాహం గురించి వస్తున్న న్యూస్ మీద సిద్ధార్థ్, అదితి రావు హైదరీ రియాక్ట్ అయ్యారు. తమకు ఎంగేజ్​మెంట్ జరిగిందని చెప్పారు. అదితితో కలసి తాను దిగిన ఓ ఫొటోను సిద్ధార్థ్​ నెట్టింట షేర్ చేశారు. ‘ఆమె నాకు ఎస్ చెప్పింది. ఎంగేజ్డ్’ అని ఆయన పేర్కొన్నారు. అదే ఫొటోను అదితి కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘అతడు నాకు ఎస్ చెప్పాడు’ అని ఆమె తెలిపారు. తమకు నిశ్చితార్థం జరిగిందంటూ సిద్ధార్థ్-అదితి పెట్టిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీని మీద ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు నెటిజన్స్ స్పందిస్తున్నారు. ఈ కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు. మీ జంట బ్యూటిఫుల్​గా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

siddarth-aditi engagementఇక, డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించిన ‘మహా సముద్రం’ సినిమా కోసం సిద్ధార్థ్, అదితి ఫస్ట్ టైమ్ కలసి వర్క్ చేశారు. ఆ మూవీ షూటింగ్​ టైమ్​లోనే ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. వీళ్లిద్దరూ లవ్​లో ఉన్నారంటూ అప్పట్లో బాగా ప్రచారం సాగింది. అయితే అవన్నీ ఒట్టి పుకార్లేనని.. వాటిల్లో ఎలాంటి నిజం లేదని, తాము ఇద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని ఈ జంట పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చింది. కాగా, వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి గుడిలో బుధవారం ఉదయం సిద్ధార్థ్-అదితి మ్యారేజ్ జరిగిందని గాసిప్ వైరల్ అయింది. అయితే తమ ఎంగేజ్​మెంట్ జరిగిందని ఈ స్టార్లు క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి