Nidhan
హీరోయిన్ అదితి రావు హైదరీతో పెళ్లి వార్తలపై సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చారు. ఒక్క ఫొటోతో అసలు ఏం జరుగుతోందో చెప్పేశారు.
హీరోయిన్ అదితి రావు హైదరీతో పెళ్లి వార్తలపై సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చారు. ఒక్క ఫొటోతో అసలు ఏం జరుగుతోందో చెప్పేశారు.
Nidhan
సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన వార్తలపై ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఫిల్మ్ స్టార్స్ విషయంలో ఈ ఆసక్తి మరింత అధికంగా ఉంటుంది. వాళ్లు ఎవర్ని పెళ్లి చేసుకుంటారు? ఎవర్ని ప్రేమిస్తున్నారు? లాంటి విషయాలకు సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా మరో హీరో మ్యారేజ్ టాపిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హీరో సిద్ధార్థ్ మ్యారేజ్ చేసుకున్నారనే వార్త నెట్టింట మార్మోగుతోంది. హీరోయిన్ అదితి రావు హైదరీని ఆయన సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే వీటి మీద ఈ జంట రియాక్ట్ అయ్యారు. ఒకే ఒక్క ఫొటోతో మ్యారేజ్ రూమర్స్ అన్నింటికీ క్లారిటీ ఇచ్చేశారు.
వివాహం గురించి వస్తున్న న్యూస్ మీద సిద్ధార్థ్, అదితి రావు హైదరీ రియాక్ట్ అయ్యారు. తమకు ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పారు. అదితితో కలసి తాను దిగిన ఓ ఫొటోను సిద్ధార్థ్ నెట్టింట షేర్ చేశారు. ‘ఆమె నాకు ఎస్ చెప్పింది. ఎంగేజ్డ్’ అని ఆయన పేర్కొన్నారు. అదే ఫొటోను అదితి కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘అతడు నాకు ఎస్ చెప్పాడు’ అని ఆమె తెలిపారు. తమకు నిశ్చితార్థం జరిగిందంటూ సిద్ధార్థ్-అదితి పెట్టిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీని మీద ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు నెటిజన్స్ స్పందిస్తున్నారు. ఈ కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు. మీ జంట బ్యూటిఫుల్‌గా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
#Siddharth & #AditiRaoHydari Are Now Officially Engaged ❤️💍
Best Wishes For Both 💕 pic.twitter.com/y7j5Wx9YH2
— Kolly Corner (@kollycorner) March 28, 2024