iDreamPost

చనిపోయే లోపు ఆ హీరోతో సినిమా తీయాలన్నదే నా కల: ప్రశాంత్ నీల్

  • Author singhj Published - 09:50 PM, Thu - 30 November 23

చనిపోయే లోపు ఆ హీరోతో సినిమా తీయాలన్నదే తన బిగ్గెస్ట్ డ్రీమ్ అని స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అన్నారు. నీల్ మామ ఎవరి గురించి అన్నారో ఇప్పుడు చూద్దాం..

చనిపోయే లోపు ఆ హీరోతో సినిమా తీయాలన్నదే తన బిగ్గెస్ట్ డ్రీమ్ అని స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అన్నారు. నీల్ మామ ఎవరి గురించి అన్నారో ఇప్పుడు చూద్దాం..

  • Author singhj Published - 09:50 PM, Thu - 30 November 23
చనిపోయే లోపు ఆ హీరోతో సినిమా తీయాలన్నదే నా కల: ప్రశాంత్ నీల్

ప్రశాంత్ నీల్.. ఇండియాలోనే టాప్ ఫిల్మ్ డైరెక్టర్స్​లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనతో సినిమాలు తీయాలని ప్రొడ్యూసర్స్ క్యూ కడుతున్నారు. మీ ఫిల్మ్​లో నటించే ఛాన్స్ ఇవ్వండంటూ యాక్టర్స్ ఆయన వెంట పడుతున్నారు. కేవలం మూడు చిత్రాలు మాత్రమే తీసిన దర్శకుడికి ఇంత డిమాండ్, క్రేజ్ అంటే కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇది నిజం. ‘కేజీఎఫ్’ సిరీస్​తో నీల్ మామ పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీ సంపాదించారు. ఆయన మేకింగ్ స్టైల్, విజువలైజేషన్, హీరోయిజం, బిల్డప్ షాట్స్​కు అంతా ఫిదా అయ్యారు. సింపుల్ స్టోరీని గ్రిప్పింగ్ స్క్రీన్​ప్లేతో ఆడియెన్స్​ను సీట్లకు కట్టిపడేస్తూ ఆయన చెప్పిన విధానం సూపర్బ్ అనే చెప్పాలి. ప్రశాంత్ నీల్ సినిమాలో ప్రతి సీన్ ఓ క్లైమాక్స్ మాదిరిగా ఉంటుందని అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ప్రేక్షకులకు గూస్​బంప్స్ కలిగే సీన్స్​ను ఆయన ఎక్కువగా రాసుకుంటారు.

ప్రశాంత్ నీల్ కోసం చాలా మంది యాక్టర్స్ వెయిట్ చేస్తున్నారు. ఆయన మూవీలో నటించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే నీల్ మామ మాత్రం పక్కా ప్లానింగ్ ప్రకారం తన కెరీర్​ను మలచుకుంటున్నారు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్​తో ‘సలార్’ తీస్తున్నారాయన. ఈ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్​తో ఒక ఫిల్మ్ చేయాల్సి ఉంది. ‘సలార్’కు సంబంధించిన వర్క్స్ అన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే ఒకసారి పోస్ట్​పోన్ అయిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం సాయంత్రం విడుదల కానుంది. ‘కేజీఎఫ్​’తో ఇండియన్ బాక్సాఫీస్​ను షేక్ చేసిన నీల్ మామ.. ‘సలార్​’తో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా యాక్టర్ అండ ఉంది కాబట్టి ఈసారి భారీ రికార్డులు తిరగరాసేలాగే ఉన్నారు. డార్లింగ్​కు కూడా మంచి హిట్ పడి చాలా రోజులైంది. కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్టవ్వాలని ఆయన కూడా కోరుకుంటున్నారు.

ప్రశాంత్ నీల్ కోసం అందరూ ఎదురు చూస్తుంటే.. ఆయన మాత్రం ఒక యాక్టర్​తో సినిమా తీయాలని తహతహలాడుతున్నారు. ఆ నటుడితో మూవీ తీస్తే తన కెరీర్​కు చాలని అంటున్నారు. ఆ యాక్టర్ మరెవరో కాదు.. గ్రేట్ అమితాబ్ బచ్చన్ అని నీల్ మామ బయటపెట్టారు. ‘నేను చనిపోయే లోపు అమితాబ్ బచ్చన్​తో ఒక మూవీ చేయాలని ఉంది. 1970ల నుంచి 1990ల వరకు ఆయన నటించిన సినిమాను చూసి ఎంతో నేర్చుకున్నా. బిగ్​ బీతో సినిమా తీయడమనేది నా అతిపెద్ద కల. నా ఫిల్మ్​లో ఆయన్ను పెద్ద విలన్​గా చూపిస్తా. మరో విధంగా మాత్రం ఆయన్ను చూపను. ఒకవేళ నాతో సినిమా చేసేందుకు ఆయన ఒప్పుకుంటే మాత్రం నా జీవితంలో దాన్ని అతిపెద్ద గౌరవంగా భావిస్తా’ అని చెప్పుకొచ్చారు ప్రశాంత్ నీల్. ఈ క్రేజీ డైరెక్టర్ మాటల్ని బట్టి అమితాబ్ అంటే ఆయనకు ఎంత ఇష్టమో అర్థమవుతోంది. మరి.. నీల్ మామ తన డ్రీమ్​ను ఎప్పుడు నెరవేర్చుకుంటారో చూడాలి. నీల్-బిగ్​ బీ కాంబో మూవీ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: జూబ్లీహిల్స్‌లోనే ఎక్కువ దేశ ద్రోహులున్నారు.. తేజ షాకింగ్ కామెంట్స్

 

View this post on Instagram

 

A post shared by Fukkard (@fukkard)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి