iDreamPost

జూబ్లీహిల్స్‌లోనే ఎక్కువ దేశ ద్రోహులున్నారు.. తేజ షాకింగ్ కామెంట్స్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి దాదాపుగా ముగిపోయింది. ఇక ఫలితాలదే ఫైనల్. డిసెంబర్ 3వ తేదీన రిజల్ట్స్ తేలనున్నాయి. ఇక సినీ సెలబ్రిటీలు సైతం బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి దాదాపుగా ముగిపోయింది. ఇక ఫలితాలదే ఫైనల్. డిసెంబర్ 3వ తేదీన రిజల్ట్స్ తేలనున్నాయి. ఇక సినీ సెలబ్రిటీలు సైతం బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జూబ్లీహిల్స్‌లోనే ఎక్కువ దేశ ద్రోహులున్నారు.. తేజ షాకింగ్ కామెంట్స్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాలే తేలాల్సి ఉంది. నెల రోజుల నుండి సాగిన ఎన్నికల హడావుడి రిజల్డ్ డే అయిన డిసెంబర్ 3తో తెరపడే అవకాశం ఉంది. భారీగానే ఓటింగ్ నమోదైంది. చెదురుమొదురు ఘటనలు తప్ప.. తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. షూటింగ్, వెకేషన్స్, ఫ్యామిలీస్ తో గడిపే మన సినీ సెలబ్రిటీలు సైతం.. తమ బాధ్యతను గుర్తు ఎరిగి.. తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, వెంకటేశ్, శ్రీకాంత్, జూఎన్టీఆర్, అల్లు అర్జున్, అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రామ్ చరణ్, రానా, రవితేజ, రాజమౌళి, రాజేంద్ర ప్రసాద్, విజయ్ దేవరకొండ, రామ్, గోపీచంద్, సూపర్ స్టార్ మహేశ్ బాబు దంపతులు, రాజశేఖర్ దంపతులు ,సాయి తేజ్ వంటి స్టార్లు ఓట్లు వేశారు.

ఈ సారి భారీగా ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక సినీ సెలబ్రిటీలు ఉండే జూబ్లీహిల్స్ వద్ద కూడా సందడి నెలకొంది. పెద్ద యెత్తున ఓటు ఉన్న నటీనటులు.. పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు తేజ సైతం తన ఓటు హక్కును వినియోగించి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ మామూలుగా రోడ్లు, స్కూల్స్ బాగోలేవు, నీళ్లు రావడం లేదని కంప్లైట్లు చేస్తుంటారు. అలా చేసేవారంతా బయటకు వచ్చి ఓటువేయాలి. ఓటు వేయని వారికి కంప్లైట్ ఇచ్చే హక్కు లేదు. నాకు తెలిసి ఓట్లు వేయని వారంతా దేశ ద్రోహులు. ఆరోగ్యం బాగున్నప్పుడు బయటకు వచ్చి ఓట్లు వేయాలి. వృద్ధులు సైతం వీల్ చైర్స్‌లో కూడా వచ్చి వేస్తున్నారు’ అన్నారు.

‘సినీ సెలబ్రిటీలు ఎక్కువగా ఉంటే జూబ్లీహిల్స్‌లో ఓటింగ్ కాస్త తక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ దేశ ద్రోహులు ఉన్నట్లు అర్థం. ఎవరైతే ఇంట్లో కూర్చుని టీవీలు చూస్తున్నారో.. బయటకు వచ్చి ఓట్లు వేయడం లేదు. వాళ్లంతా దేశ ద్రోహులే‘ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓటు వేయకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే, అడిగే హక్కుని కోల్పోతారని అన్నారు. హాలీడే దొరికింది కదా..? అని బీరు తాగి పడుకోకండి.. వచ్చి ఓటు వేయండి.. అప్పుడే ప్రశ్నించే హక్కు ఉందని అన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. అలాగే విజయ్ దేవర కొండ సైతం రాష్ట్రం బాగు పడాలంటే రాజకీయ నేతల వల్లే అవుతుంది. మనం బాగుపడాలి అంటే వచ్చి ఓటు వేయండని సూచించారు. సినీ సెలబ్రిటీలంతా ఓటు వేయడం ఓ మంచి పరిణామం. మీరేమంటారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి