iDreamPost

డిసెంబర్ నుండి సైందవ్ వాయిదా! రిలీజ్ ఎప్పుడంటే..

  • Author ajaykrishna Updated - 02:31 PM, Thu - 5 October 23
  • Author ajaykrishna Updated - 02:31 PM, Thu - 5 October 23
డిసెంబర్ నుండి సైందవ్ వాయిదా! రిలీజ్ ఎప్పుడంటే..

సలార్.. ఇండస్ట్రీలో సినిమాల రిలీజ్ లను ఒక్కసారి కాదు.. రెండుసార్లు ఓ కుదుపు కుదిపేసింది. మొదటిసారి సెప్టెంబర్ 28న వస్తుందని చాలా సినిమాలు అటు రెండు వారాలు, ఇటు రెండు వారాలు తప్పుకున్నాయి. రిలీజ్ కి నెల ముందు సినిమా అనూహ్యంగా వాయిదా పడింది. కట్ చేస్తే.. సలార్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఏముంది.. మళ్ళీ అదే హైప్. సలార్ అంటే ఫ్యాన్స్ నుండి కామన్ ఆడియన్స్ వరకు అందరిలో ఒక వైబ్రేషన్ మొదలైపోయింది. ఎప్పుడెప్పుడు వస్తుందని.. దాదాపు ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి క్రిస్మస్ రిలీజ్ అని చెప్పి సర్ప్రైజ్ చేశారు మేకర్స్. ఇప్పటిదాకా వెయిట్ చేసిన దానికి.. ఈ డేట్ చాలు అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్.

కట్ చేస్తే.. సలార్ కంటే ముందు క్రిస్మస్ రిలీజ్ అనుకున్న సినిమాలకు అసలు తిప్పలు మొదలయ్యాయి. సలార్ సెప్టెంబర్ అనుకోని.. తాము డిసెంబర్ లో వస్తామని తాపీగా కర్చీఫ్ వేసుకున్న సినిమాలన్నీ ఒక్కసారిగా సలార్ రాకతో సైడ్ అయిపోయాయి. అందులో నాని హాయ్ నాన్నతో పాటు విక్టరీ వెంకీ సైందవ్ కూడా ఉంది. నిజానికి తెలుగు నుండి డిసెంబర్ 21న హాయ్ నాన్న, డిసెంబర్ 22న సైందవ్ ఫిక్స్ చేసుకున్నారు. ఆల్రెడీ రేసులో బాలీవుడ్ నుండి షారుఖ్ ఖాన్ డుంకి ఉంది. అది వేరే విషయం. కానీ.. సడన్ గా డార్లింగ్ ప్రభాస్ నుండి సలార్.. డిసెంబర్ 22న అనౌన్స్ చేయగానే టాలీవుడ్ లో రిలీజ్ లు మరోసారి మారిపోయాయి.

వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైందవ్ మూవీ.. ఏ సినిమాకు రీమేక్ కాదు. హిట్, హిట్ 2 సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉన్న డైరెక్టర్ శైలేష్ కొలను.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాని.. ఇప్పుడు డిసెంబర్ రేస్ నుండి వాయిదా వేశారు. మరి ఎప్పుడు వస్తుంది? అనంటే.. 2024 సంక్రాంతి రేసులో దింపనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అవును.. సైందవ్ మూవీ సంక్రాంతి సందర్బంగా జనవరి 13న రిలీజ్ కాబోతుంది. హమ్మయ్య.. ఎక్కువ గ్యాప్ ఇవ్వలేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక సైందవ్ వాయిదాకి కారణం.. సలార్ కాబట్టి.. అంత పెద్ద పాన్ ఇండియా మూవీ వస్తున్నప్పుడు తప్పుకోవడమే మంచిదని మాట్లాడుకుంటున్నారు. మరి సైందవ్ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి