iDreamPost

‘ప్రేమ విమానం’ ఓటిటి మూవీ రివ్యూ!

‘ప్రేమ విమానం’ ఓటిటి మూవీ రివ్యూ!

ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకులు ఇష్టమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసి ఎంజాయ్ చేయగలుగుతున్నారు. తాజాగా జీ5 ఓటిటిలో ‘ప్రేమ విమానం’ మూవీ రిలీజైంది. అనసూయ, సంగీత్ శోభన్, శాన్వీ మేఘనా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమాని.. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మించారు. సంతోష్ కాట రూపొందించిన ఈ సినిమా ట్రైలర్.. ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకులకు ఆకట్టుకుంది. మరి జీ5లో స్ట్రీమింగ్ మొదలైన ప్రేమ విమానం మూవీ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం!

కథ:

90లలో జరిగే కథ ఇది. తెలంగాణలోని ఓ గ్రామంలో శాంతమ్మ(అనసూయ) భర్త, ఇద్దరు పిల్లలతో చిన్న గుడిసెలో జీవిస్తుంటుంది. మరోవైపు మణి(సంగీత్ శోభన్).. ఆ ఊరి సర్పంచ్ కూతురు అభిత(శాన్వీ) ప్రేమించుకుంటారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని తెలిసి ఇద్దరు లేచిపోతారు. కట్ చేస్తే.. శాంతమ్మ చిన్న కొడుకు లచ్చు.. విమానం ఎక్కాలని బలమైన తాపత్రయపడుతుంటాడు. అప్పటికే వాళ్ళ ఫ్యామిలీ అప్పులతో బాధ పడుతుంటుంది. మరి మణి, అభిత ఊరి లేచిపోయి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? చివరికి ఫ్యామిలీస్ ఒప్పుకున్నాయా లేదా? శాంతమ్మ కొడుకు లచ్చు విమానం ఎక్కాలని ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరికి ఇటు ప్రేమ, అటు విమానం కథలు ఏమయ్యాయి? అనేది మూవీలో చూడాలి.

విశ్లేషణ:

సినిమా కథలో ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ బట్టి.. కథనం బలంగా రాసుకోవాల్సి ఉంటుంది. ప్రేమ విమానం మూవీ.. 90ల నేపథ్యంలో తెరకెక్కింది. రెండు పల్లెటూర్లలో జరిగే.. కథలను సహజంగా తెరపై ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ట్రైలర్ తో ఫీల్ గుడ్ ఎమోషన్స్ ఉన్నాయని.. గుర్తు చేసిన మేకర్స్.. ఆడియన్స్ లో ఇంటరెస్ట్ అయితే క్రియేట్ చేయగలిగారు. ఇక సినిమా విషయానికి వస్తే.. చిన్న చిన్న లాజిక్స్ సినిమాలలో మేజర్ మిస్టేక్స్ గా ఒక్కోసారి అనిపిస్తుంటాయి. సినిమాలో చిన్న పిల్లాడికి విమానం ఎక్కాలని కోరిక రావడం ఓకే. కానీ.. సినిమా అంతా అదొక్కటే పట్టుకొని మొండిగా ప్రవర్తించడం కాస్త వీక్షకులకు పట్టకపోవచ్చు.

ఆ రోజుల్లో విమానం ఎక్కాలని కోరిక ఉన్నా.. ఇంత టెక్నాలజీ, డబ్బు లేదు. పైగా గుడిసెలో జీవనం అంటే.. అలాంటి కోరికలన్నీ తాహత్తుకు మించినవే అవుతాయి తప్ప.. ఎంత సాధించినా ఈజీ అవుతాయని చూపించడం ఏదొక మూమెంట్ లో లైన్ దాటిందేమో అనిపిస్తుంది. ఓవైపు శాంతమ్మ(అనసూయ) ఫ్యామిలీ, పిల్లలు, ఊరు కథ.. మరోవైపు మణి(సంగీత్ శోభన్), అభిత(శాన్వీ), మణి తండ్రి గోపరాజు రమణల స్టోరీలను చక్కగా.. 90స్ కాలానికి అనుగుణంగా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. రెండు పల్లెటూర్లలో స్టోరీలను సహజంగా పరిచయం చేశారు.

ఎమోషనల్ ఫీల్ గుడ్ డ్రామాగా వచ్చిన మూవీలో.. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్, లవ్ ట్రాక్ బాగున్నాయి. కానీ.. స్క్రీన్ ప్లే పరంగా కొంచం తడబడింది అని చెప్పవచ్చు. మంచి కథాంశం ఎంచుకున్న దర్శకుడు.. దాన్ని అంతే ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడంలో తడబడ్డాడు. ఫీల్ గుడ్ మూవీలో.. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్ పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. బట్ అవి కూడా మిస్ అయ్యాయని అనుకుంటే అది ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్స్ కి వదిలేయాలి. సినిమాలో కొన్ని లాజిక్స్ పక్కన పెడితే.. దర్శకుడు చెప్పాలనుకున్న మెయిన్ స్టోరీ, ఎమోషనల్ మూమెంట్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి వచ్చినప్పటికీ.. అన్ని వర్గాల వారిని మెప్పించే అంశాలు మిస్ అయ్యాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. శాంతమ్మ క్యారెక్టర్ లో అనసూయ చక్కగా నటించింది. ముఖ్యంగా కొడుకులతో పడే ఇబ్బందులు.. ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకుంటుంది. రాము, లచ్చు క్యారెక్టర్స్ లో పిల్లలు దేవాన్ష్, అనిరుధ్ చక్కగా చేశారు. సినిమాకు లవ్ ట్రాక్ ప్లస్ అయ్యింది. మణిగా సంగీత్ శోభన్, అభితగా శాన్వీ, మణి తండ్రిగా గోపరాజు రమణ పాత్రలు ఆకట్టుకుంటాయి. సినిమాకు స్లో నేరేషన్ మేజర్ మైనస్. టెక్నికల్ గా.. సినిమాకు జగదీశ్ చీకటి కెమెరా వర్క్, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ప్లస్ అయ్యాయి. ఇలాంటి కంటెంట్ ని ప్రోత్సహించిన నిర్మాత అభిషేక్ నామాని అభినందించాలి. ఇతర పాత్రలలో ‘వెన్నెల’ కిశోర్, అభయ్ బేతిగంటి, సురభి ప్రభావతి, కల్పలత తదితరులు వారి వారి పాత్రలలో ఒదిగిపోయారు.

ప్లస్ లు:

  • స్టోరీ
  • సినిమాటోగ్రఫీ
  • మ్యూజిక్
  • లవ్ ట్రాక్, ఎమోషన్స్

మైనస్ లు:

  • లాజిక్స్ మిస్సింగ్
  • స్లో నేరేషన్

చివరిమాట: ప్రేమ విమానం.. ఫీల్ గుడ్ స్లో డ్రామా!

రేటింగ్: 2.5/5

(ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి