iDreamPost

అంబానీ ప్రీ వెడ్డింగ్‌కు వచ్చినందుకు కోట్ల రెమ్యూనరేషన్‌! అంతా కమర్షియల్‌..

Ambani Pre Wedding Celebrities: దేశంలో కనీ వినీ ఎరుగని రీతిలో అత్యంత వైభవంగా ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబీనీ రెండవ తనయుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ సెలబ్రెటీలు తెగ సందడి చేశారు.

Ambani Pre Wedding Celebrities: దేశంలో కనీ వినీ ఎరుగని రీతిలో అత్యంత వైభవంగా ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబీనీ రెండవ తనయుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ సెలబ్రెటీలు తెగ సందడి చేశారు.

అంబానీ ప్రీ వెడ్డింగ్‌కు వచ్చినందుకు కోట్ల రెమ్యూనరేషన్‌! అంతా కమర్షియల్‌..

రిలయన్స్ అధినేత  ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో దేశ విదేశాల నుంచి అధినేతలు, సినీ, రాజకీయ, క్రీడా, పారిశ్రామిక రంగాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడాది జులై 12న అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహం జరుగనుంది. ఈ వివాహానికి ముందే మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జామ్ నగర్ లో కోలాహలంగా జరిగాయి.  అంబానీ ఇంట జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుక భారత్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా టాక్ ఆప్ ది టౌన్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకకు దాదాపు సినీ పరిశ్రమలోని దిగ్గజ నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు హాజరయ్యారు. వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది హాలీవుడ్ పాప్ సింగర్ రిహానా. అమెరికన్ సింగర్ రాబిన్ రిహానా ఫెంటీ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో పర్ఫామెన్స్ ఇవ్వడానికి కోట్లలో పారితోషియం తీసుకున్నట్లు టాక్. ఇదిలా ఉంటే.. ఇటీవల ప్రముఖల ఇండ్లలో జరిగే ఈవెంట్స్ కి సినీ ఇండస్ట్రీకి చెందిన సినీ తారులు హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో పాటలు పాడుతూ.. డ్యాన్స్ చేస్తూ..  అతిధులను ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారు. ఇందుకోసం సెలబ్రటీలు భారీగానే వసూళ్లు చేస్తున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. పెళ్లిళ్లకు డబ్బులిచ్చి సెలబ్రెటీలను తీసుకువస్తున్నారు. బడా వ్యాపారవేత్తలు, రాజకీయ రంగాలకు చెందిన వారు తమ ఇంట్లో జరిగే వేడుకలకు సెలబ్రెటీలను పిలవడం ప్రెస్టేజియస్ గా తీసుకుంటున్నారని.. అర్థగంట సేపు కనిపించి ఎంటర్‌టైన్‌ చేస్తే కోట్లలో పారితోషికం ఇస్తున్నారని అన్నారు. తనకు కూడా చాలా ప్రపోజల్స్ వచ్చాయని.. కానీ తనకు అలాంటివి ఇష్టం లేక వెళ్లలేదన్నారు. మొత్తానికి సెలబ్రెటీలు వేడుకల్లో గెస్టులు మాత్రమే కాదు.. నటులుగా మంచి రెమ్యూనరేషన్ కూడా వసూళ్లు చేస్తున్నారంటూ ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం కింగ్ నాగార్జున మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి