iDreamPost
android-app
ios-app

అనంత్ అంబానీ పెళ్లికి అదిరిపోయే గిఫ్టులు.. ఏకంగా 40 కోట్ల గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో!

  • Published Jul 23, 2024 | 11:20 AM Updated Updated Jul 23, 2024 | 11:26 AM

Expensive Wedding Gifts:ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబాని-నీతూ అంబాని ముద్దుల తనయుడు అనంత్ అంబాని వివాహం రాధికా మర్చంట్ తో జులై 12న అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజులు పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకకు దేశ, విదేశాల నుంచి వీవీఐపీలు వచ్చి సందడి చేశారు.

Expensive Wedding Gifts:ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబాని-నీతూ అంబాని ముద్దుల తనయుడు అనంత్ అంబాని వివాహం రాధికా మర్చంట్ తో జులై 12న అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజులు పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకకు దేశ, విదేశాల నుంచి వీవీఐపీలు వచ్చి సందడి చేశారు.

  • Published Jul 23, 2024 | 11:20 AMUpdated Jul 23, 2024 | 11:26 AM
అనంత్ అంబానీ పెళ్లికి అదిరిపోయే గిఫ్టులు.. ఏకంగా 40 కోట్ల గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో!

రిలయన్స్ అధినేత, ప్రపంచంలో సంపన్నుల్లో ఒకరైన ముఖేష్ అంబాని చిన్న కుమారుడు అనంత్ అంబాని- రాధికా మర్చంట్ వివాహం జులై 12న ముంబైలోని బాంద్రా – కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ఎంతో వైభవంగా జరిగింది. ఈ పెళ్లి కార్యక్రమానికి విదేశాల నుంచి సెలబ్రెటీలు, ప్రముఖులతో పాటు సింగర్స్ వచ్చారు. అంబానీ ఇంట శుభకార్యాలు జరిగితే బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. స్టార్లు అంతా అక్కడే దర్శనమిస్తుంటారు. ప్రపంచం మొత్తం అంబానీ ఇంట పెళ్లి గురించిన చర్చలే నడిచాయి. తాజాగా అనంత్ అంబానీ వివాహానికి కళ్లు చెదిరే గిఫ్టులు వచ్చినట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

Anant Ambani wedding gifts 04

ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ-నీతూ అంబాని చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జంట వివాహ ఉత్సవం ఇంకా పూర్తి కాలేదు.. త్వరలో లండన్ లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు అంబానీ ఫ్యామిలీ. శుభ్ ఆశీర్వాద్ వేడుక పూర్తి అయ్యాక అంబానీ కుటుంబ సభ్యులు పెళ్లికి వచ్చిన సెలబ్రెటీలకు ప్రత్యేక ధన్యవాదాలే తెలిపారు. ఇక ఈ పెళ్లికి అక్షరాలా రూ.5000 వేల కోట్లు దాటినట్లు అంచనా. అయితే పెళ్లికి హాజరైన సెలబ్రెటీలకు అంబానీ ఫ్యామిలీ ప్రత్యేక బహుమతులు ఇచ్చి సత్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కొక్కరికి ఏకంగా 2 కోట్లు విలువ చేసే వాచ్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు మీడియాలో కథనాలు వస్తునాయి. అయితే అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ కి ప్రముఖుల నుంచి కళ్లు చెదిరే గిఫ్ట్ లు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

మెటా సీఈఓ మార్క్ జుకర్ దాదాపు రూ.300 కోట్లు విలువ చేసే ప్రైవేట్ జెట్ ని బహుమతిగా ఇవ్వడం విశేషం. అమెజాన్ సీఈఓ జెఫ్ బేజోన్ రూ.11.5 కోట్ల విలువైన విలాసవంతమైన కారును బహుబతిగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక బాలీవుడ్ బాద్ షా.. షారూఖ్ ఖాన్..  అనంత్ అంబానీ దంపతులకు ఫ్రాన్స్ లో రూ.40 కోట్ల విలువైన అపార్ట్ మెంట్ ని బహుమతిగా ఇచ్చారని సమాచారం. బిగ్ బీ అమితాబచ్చన్ రూ.30 కోట్ల విలువైన నెక్‌లెస్ బహుబతి గా ఇచ్చారట. రణవీర్ సింగ్ – దీపికా పదుకొనే రూ.20 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కారును బహుమతిగా ఇచ్చారట, సల్మాన్ కాన్ రూ.15 కోట్ల విలువైన స్పోర్ట్స్ బైక్ బహుబతిగా ఇచ్చారట. ఇక నవ దంపతులకు ముఖేష్ అంబానీ- నీతూ అంబానీ దుబాయ్ లో ప్రఖ్యాత పామ్ జుమేరాలోని దాదాపు 3 వేల చదరపు అడుగుల ఇంటిని బహుమతిగా ఇచ్చారట.. దీని విలువ రూ.60 కోట్లని తెలుస్తుంది. మొత్తానికి పెద్దింటొళ్ల పెళ్లికి పెద్ద కానుకలే వచ్చాయని నెటిజన్లు అనుకుంటున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet