iDreamPost
android-app
ios-app

లోకేశ్ కనగరాజ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్! రజినీ మూవీలో విలన్ గా నాగ్!

  • Published Jul 23, 2024 | 5:54 PM Updated Updated Jul 23, 2024 | 5:54 PM

Nagarjuna play villain role in Rajinikanth Coolie movie: ఇండస్ట్రీలో ఓ న్యూస్ బీభత్సంగా వైరల్  అవుతోంది. అదేంటంటే? రజినీకాంత్ మూవీలో టాలీవుడ్ మన్మథుడు విలన్ గా నటిస్తున్నాడట. ఆ వివరాల్లోకి వెళితే..

Nagarjuna play villain role in Rajinikanth Coolie movie: ఇండస్ట్రీలో ఓ న్యూస్ బీభత్సంగా వైరల్  అవుతోంది. అదేంటంటే? రజినీకాంత్ మూవీలో టాలీవుడ్ మన్మథుడు విలన్ గా నటిస్తున్నాడట. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 23, 2024 | 5:54 PMUpdated Jul 23, 2024 | 5:54 PM
లోకేశ్ కనగరాజ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్! రజినీ మూవీలో విలన్ గా నాగ్!

ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉంటుందో.. అలాగే హీరో అండ్ విలన్ కాంబోకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే.. వీరి కాంబోకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. డైెరెక్టర్లు సైతం హీరోను ఢీకొట్టడానికి బలమైన విలన్ నే ఎంచుకోవాలని చూస్తుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ న్యూస్ బీభత్సంగా వైరల్  అవుతోంది. అదేంటంటే? రజినీకాంత్ మూవీలో టాలీవుడ్ మన్మథుడు విలన్ గా నటిస్తున్నాడట. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

లోకేశ్ కనగరాజ్.. తీసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. కార్తీతో తీసిన ‘ఖైదీ’ మూవీతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత కమల్ హాసన్ తో విక్రమ్ తీసి ఎక్కడికో వెళ్లిపోయాడు. లోకీ సినిమాటిక్ యూనివర్స్ ను ఏర్పాటు చేశాడు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘కూలీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది లోకేశ్ యూనివర్స్ కు భిన్నంగా సాగే కథ అన్నారు. ఇక ఈ మూవీలో రజినీకాంత్ ను ఢీ కొట్టేందుకు విలన్ గా నాగార్జునను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

కాగా.. గతంలో ఓ బాలీవుడ్ మూవీలో విలన్ గా నటించాడు నాగ్. ఈ వార్త నిజమైతే.. ఇప్పుడు మరోసారి విలన్ గా తన విశ్వరూపం చూపించనున్నాడు. అయితే ఇందుకు సంబంధించి మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాలు మాత్రం సూపర్ స్టార్ కు విలన్ గా నాగ్ నటించబోతున్నాడు అంటూ బలంగా చెబుతున్నాయి. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నాగ్ ధనుష్ మూవీ కుబేరలో కూడా నటిస్తున్నాడు. ఏ పాత్రలో అయినా అదరగొట్టే సత్తా నాగ్ సొంతం. అందుకే అతడిని విలన్ గా తీసుకోవాలని లోకేశ్ భావిస్తున్నాడు. మరి రజినీ మూవీలో నాగ్ విలన్ గా నటిస్తే చూడాలని ఎంత మంది కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişajaxbet girişgrandpashabet