iDreamPost
android-app
ios-app

క్రేజీ న్యూస్.. మరోసారి బిగ్ బాస్ లోకి శివాజీ!

  • Published Jul 24, 2024 | 5:49 PM Updated Updated Jul 24, 2024 | 5:49 PM

Actor Shivaji Going To Be A Part Of Bigg Boss Telugu Season 8 Speculation: బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ సీజన్ ని కూడా వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని చూస్తున్నారు. అయితే ఈసారి లిస్ట్ లోకి శివాజీ పేరు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Actor Shivaji Going To Be A Part Of Bigg Boss Telugu Season 8 Speculation: బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ సీజన్ ని కూడా వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని చూస్తున్నారు. అయితే ఈసారి లిస్ట్ లోకి శివాజీ పేరు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

  • Published Jul 24, 2024 | 5:49 PMUpdated Jul 24, 2024 | 5:49 PM
క్రేజీ న్యూస్.. మరోసారి బిగ్ బాస్ లోకి శివాజీ!

బిగ్ బాస్.. ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులు, నెటిజన్స్, ఓటీటీ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో ఏ సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ షో.. ఇప్పుడు 8వ ఎపిసోడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఇప్పటికే హోస్ట్ కింగ్ నాగార్జున కొత్త లోగో కూడా ఆవిష్కరించారు. ఇన్ఫినిటీ ఎంటర్ టైన్మెంట్, ఫన్ అంటూ ప్రేక్షకుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సీజన్స్ కి భిన్నంగా.. మరింత ఉత్సాహంగా, కొత్తగా, వినూత్నంగా ఈ 8వ సీజన్ ఉండబోతోంది అంటూ గట్టిగానే టాక్ వినిపిస్తోంది. దానికి తగినట్లు కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. క్రూని కూడా సెలక్ట్ చేస్తున్నారు అంటున్నారు.

బిగ్ బాస్ షో అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక గురి కుదిరింది. ఈ షోతో ఎంటర్ టైన్మెంట్ పక్కా అని ఫిక్స్ అయిపోయారు. ఆ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ నిర్వాహకులు కూడా ముందుకు వెళ్తున్నారు. ఒక్కో సీజన్ ముగిసిన తర్వాత వారి మీద బాధ్యత కూడా పెరుగుతోంది. అందుకే దానికి తగినట్లు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన కంటెస్టెంట్స్ పేర్లు చూస్తే షో మీద అంచనాలు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. ఈసారి వేణుస్వామి, బర్రెలక్క, కుమారీ ఆంటీ, తేజశ్విని గౌడ, వైష్ణవి పిస్సే, బంచిక్ బబ్లూ, సాకేత్, శ్వేతా నాయుడు, యాదమరాజు, మై విలేజ్ షో అనీల్, నిఖిల్, అక్షిత, సోనియా సింగ్, ఖయూమ్, రేఖా భోజ్ వంటి చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. వీటికి అదనంగా శివాజీ పేరు లిస్ట్ లోకి రావడం విశేషం.

శివాజీ మొన్న సీజన్ లోనే చాలా ఇబ్బంది పడ్డాడు. మళ్లీ వస్తాడు అంటారా? అని అప్పుడే ప్రశ్నలు స్టార్ట్ చేయకండి. అయితే శివాజీని కంటెస్టెంట్ గా కాదు.. బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ అంటే వేలికేస్తే కాలికి.. కాలికేస్తే మెడకి వేసేలా ఉండాలి. అలాంటి అనుభవం, టాలెంట్ గత సీజన్లో శివాజీకి మించి ఎవరికీ లేదు. పైగా ఇప్పటివరకు బజ్ కి అంత బజ్ వచ్చింది లేదు.

కానీ, శివాజీ గనుక బజ్ హోస్ట్ అయితే అది నెక్స్ లెవల్లో ఉంటుంది అని మేకర్స్ కూడా భావిస్తున్నారట. అదే జరిగితే శివాజీ బిగ్ బాస్ బజ్ హోస్ట్ అయిపోయినట్లే. ఎటూ కెరీర్లో సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసిన శివాజీకి ఈ అవకాశం వస్తే వద్దు అనకపోవచ్చు. ప్రేక్షకులు కూడా శివాజీలాంటి వ్యక్తే బజ్ కి హోస్ట్ గా రావాలి అని కోరుకుంటున్నారు. అన్నీ కలిసొస్తే.. మాత్రం మరోసారి శివాజీని బిగ్ బాస్ లో చూసినట్లే. అంటే బజ్ హోస్ట్ గా అనమాట. మరి.. శివాజీని బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా చేయాలి అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss