iDreamPost
android-app
ios-app

రాధిక మర్చంట్‌కు జాన్వీకపూర్ పార్టీ! పిక్స్ బయటకి రావడంతో షాకింగ్ కామెంట్స్!

  • Published Jul 22, 2024 | 2:32 PM Updated Updated Jul 22, 2024 | 2:32 PM

Janhvi Kapoor: జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. హీరోయిన్ గానే కాకుండా పలు స్పెషల్ సాంగ్స్‌లో కూడా నటిస్తుంది. ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. నటిగానే కాకుండా పలు యాడ్స్ లో నటిస్తున్న జాన్వీ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Janhvi Kapoor: జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. హీరోయిన్ గానే కాకుండా పలు స్పెషల్ సాంగ్స్‌లో కూడా నటిస్తుంది. ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. నటిగానే కాకుండా పలు యాడ్స్ లో నటిస్తున్న జాన్వీ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

  • Published Jul 22, 2024 | 2:32 PMUpdated Jul 22, 2024 | 2:32 PM
రాధిక మర్చంట్‌కు జాన్వీకపూర్ పార్టీ! పిక్స్ బయటకి రావడంతో షాకింగ్ కామెంట్స్!

భారతీయ చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ హీరోయిన్ గా వెలిగిపోయిన శ్రీదేవి తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా నెంబర్ వన్ రేస్ లో నిలిచింది. స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని వివాహం చేసుకుంది. ఈ జంటకు జాన్వీ కపూర్, కుషీ కపూర్ లు జన్మించారు. తన కూతురుని హీరోయిన్ గా చూడాలన్న కోరికతో  ఉన్న శ్రీదేవి ఆ కోరిక తీరకుండానే అనూహ్యంగా కన్నుమూశారు. బాలీవుడ్‌లోకి శ్రీదేవి నట వారసురాలిగా ‘ధడక్’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ మధ్యనే అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో అంగరంగ వైభవంగా జరిగింది. గతంలో తన స్నేహితురాలైన రాధికా మర్చెంట్‌కి జాన్వీ ఓ పార్టీ ఇచ్చింది.. తాజాగా ఆ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..

ఆసియాలోనే ఆగర్భశ్రీమంతుడైన ముఖేష్ అంబానీ-నీతూ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ- రాధికా మర్చెంట్ తో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అంబానీ ఇంట జరిగిన పెళ్లి గురించిన చర్చలే సాగాయి. విదేశీల నుంచి ప్రముఖులు,బాలీవుడ్, క్రీడా రంగానికి చెందిన వారు మూడు రోజులు పాటు సాగిన వెడ్డింగ్ ఈవెంట్ లో పాల్గొని సందడి చేశారు. అనంత్ అంబానీ- రాధిక మర్చెంట్ పెళ్లికి దాదాపు ఆరు వేల కోట్లు ఖర్చయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్ ఈవెంట్‌గా చెప్పుకుంటున్నారు. పెళ్లికి ముందు రాధిక మార్చంట్ కి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఓ పార్టీ ఇచ్చింది. ఆ పార్టీ ఎందుకు ఇచ్చిందో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ‘రాధికా మర్చెంట్ నాకు మంచి స్నేహితురాలు..ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచే మా మధ్య స్నేహం కొనసాగుతుంది. రాధిక మా అందరితో ఎంతో హ్యాపీగా ఉంటుంది.. మా ఫ్రెండ్స్ అందరినీ జాగ్రత్తగా చూసుకుంటుంది. తనకు పెళ్లికి ముందు ఒక ప్రత్యేకమైన పార్టీ ఇవ్వాలని మా ఫ్రెండ్స్ అందరం అనుకున్నాం. అందుకోసం ముందుగానే ఓ పార్టీకి ప్లాన్ చేసి ఇచ్చాం. ఆ పార్టీలో స్నేహితులతో రాధిక సంతోషంగా ఎంజాయ్ చేసింది. ఆ సమయంలో ఎల్లపుడు ఒకరికొకరం అండగా ఉండాలని చెప్పుకున్నాం’ అని జాన్వీ చెప్పారు. ప్రస్తుతం జాన్వీ ‘ఉలఝ్’ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా ఈ మూవీని తెరకెక్కించారు. జంగ్లీ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ మూవీలో జాన్వీ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిగా కనిపించబోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio