iDreamPost

Ram Charan: గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ షాకింగ్ రోల్! ఆ డిజార్డర్ ఉన్న పాత్రలో..

గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇందులో చరణ్ పాత్రకు ఓ డిజార్డర్ ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇందులో చరణ్ పాత్రకు ఓ డిజార్డర్ ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Ram Charan: గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ షాకింగ్ రోల్! ఆ డిజార్డర్ ఉన్న పాత్రలో..

సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న హీరోలు చాలా అరుదనే చెప్పాలి. ఆ అరుదైన జాబితాలో మెగా హీరో రామ్ చరణ్ ఒకడు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు చరణ్. మగధీర నుంచి చూసుకుంటే ఆర్ఆర్ఆర్ వరకు దేనికి అదే ప్రత్యేకమైన సినిమాగా నిలిచాయి. ఇక ‘రంగస్థలం’ మూవీతో తనలో నటుడిని ఓ మెట్టు పైకెక్కించాడు. ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే పొలిటికల్ డ్రామా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం గురించి లీకుల మీద లీకులు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది.

‘గేమ్ ఛేంజర్’ పొలిటికల్ డ్రామాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ ను క్రియేట్ చేసుకుంది. ఈ మూవీ గురించి ఇప్పటికే ఎన్నో విశేషాలు లీకుల రూపంలో బయటకి వచ్చాయి. అందులో రామ్ చరణ్ పాత్రపైనే ఎక్కువ లీకులు వచ్చాయి. గేమ్ ఛేంజర్ లో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, తండ్రీ, కొడుకు పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. తండ్రి పాత్రకు అప్పన్న పేరు పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అసలు విషయం ఏంటంటే? తండ్రి పాత్రకు ఓ లోపం ఉందని లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ లో తండ్రి, కొడుకు పాత్రల్లో కనిపించనున్నాడట రామ్ చరణ్. అందులో తండ్రి రోల్ కు అప్పన్న అనే పేరును పెట్టినట్లు సమాచారం. అయితే తండ్రి పాత్రకు నత్తి ఉన్నట్లుగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అతడి నుంచి వచ్చే డైలాగ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయని టాక్. అప్పన్న పాత్రకు నత్తి పెట్టడానికి కారణం ఇద్దరి పాత్రల మధ్య వైరుధ్యం చూపించాడనికే డైరెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్. ఈ విషయం బయటకు తెలియడంతో.. సినిమాపై మరింత హైప్ పెరిగింది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయం తెలిసి కాస్త ఆందోళనగా ఉన్నారు.  రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోకు ఇలాంటి డిజార్డర్ పెట్టడం ఏంటని? ప్రశ్నిస్తున్నారు. అయితే ‘రంగస్థలం’ మూవీలో చరణ్ చెవులు వినబడని వ్యక్తిగా అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి