iDreamPost

‘గేమ్ ఛేంజర్’ OTT పార్ట్ నర్ ఫిక్స్.. సినీ చరిత్రలో భారీ ఢీల్

  • Author Soma Sekhar Updated - 11:32 PM, Thu - 2 November 23
  • Author Soma Sekhar Updated - 11:32 PM, Thu - 2 November 23
‘గేమ్ ఛేంజర్’ OTT పార్ట్ నర్ ఫిక్స్.. సినీ చరిత్రలో భారీ ఢీల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ వాయిదాలు పడుతూ.. కొనసాగుతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 రోజుల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రామ్ చరణ్, ప్రధాన తారాగాణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే? గేమ్ ఛేంజర్ ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు ఓ ప్రముఖ సంస్థ చేజిక్కించుకున్నట్లు సమాచారం.

గేమ్ ఛేంజర్.. ఓటీటీ రైట్స్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ ధరకు అమ్ముడైనట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి అన్ని భాషల ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ5 సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇందుకు గాను దాదాపు రూ. 250 కోట్లు చెల్లించినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇదే గనక నిజమైతే.. టాలీవుడ్ లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేసినట్లే. చరిత్రలో ఈ ఢీల్ నిలిచిపోతుంది.

ఇప్పటి వరకు ఏ చిత్రానికి ఇంత భారీ మెుత్తం చెల్లించలేదు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ స్ట్రీమింగ్ రైట్స్ ను రూ. 90 కోట్లకు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. 2024 వేసవిలో ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం. కానీ శంకర్ ఇండియన్ 2 సినిమాను కూడా ప్రారంభించడంతో.. గేమ్ ఛేంజర్ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రేంజ్ ఓటీటీ ధర గేమ్ ఛేంజర్ దక్కించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి