iDreamPost

కాల్ గర్ల్స్ పేరుతో వెబ్ సైట్.. ఏకంగా 80 మందిని నమ్మించి..!

  • Author naresh1 Published - 09:24 PM, Sat - 21 October 23

కాల్ గర్ల్స్ పేరుతో ఓ నకిలీ వెబ్ సైట్ తయారు చేసి మోసానికి పావులు కదిపారు. ఇక ఇదంతా నిజమే అనుకున్న కొందరు అమాయక యువకులు వారి మాయలో పడి నిండా మోసపోయారు.

కాల్ గర్ల్స్ పేరుతో ఓ నకిలీ వెబ్ సైట్ తయారు చేసి మోసానికి పావులు కదిపారు. ఇక ఇదంతా నిజమే అనుకున్న కొందరు అమాయక యువకులు వారి మాయలో పడి నిండా మోసపోయారు.

  • Author naresh1 Published - 09:24 PM, Sat - 21 October 23
కాల్ గర్ల్స్ పేరుతో వెబ్ సైట్.. ఏకంగా 80 మందిని నమ్మించి..!

సోషల్ మీడియా కొత్త పంతలు తొక్కడంతో లాభం ఎంత ఉందో.. నష్టం అంతకు మించి ఉంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అవును, మీరు విన్నది నిజమే. దీన్నే ఆసరాగా చేసుకున్న కొందరు ఫేక్ రాయుళ్లు అమాయక యువకుల మైనస్ పాయింట్ ను క్యాష్ చేసుకుని ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఓ ముఠా సభ్యులు.. అచ్చం ఇలాంటి దారుణానికే తెర లేపారు. కాల్ గర్ల్స్ పేరుతో ఓ నకిలీ వెబ్ సైట్ తయారు చేసి మోసానికి పావులు కదిపారు. ఇక ఇదంతా నిజమే అనుకున్న కొందరు అమాయక యువకులు వారి మాయలో పడి నిండా మోసపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మనీశ్ చౌదరి, అశోక్ సేన్,సుబ్రాతి ఖాన్, దీపక్ మీనా, ప్రీతమ్ సింగ్‌ అనే యువకులు కష్టపడకుండా ఈజీగా డబ్బులు ఎలా సంపాదించాలనే మార్గాలను వెతికారు. ఇందుకోసం కార్ల్ గర్ల్స్ పేరుతో ఓ నకిలీ యాప్ ను రూపొందించారు. ఈ యాప్ లో ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న కొందరి అందమైన అమ్మాయిల ఫోటోలను అందులో లో జత చేశారు. ఇక దీని ద్వారా వేశ్యలను సప్లయ్ చేస్తామని ఈ ముఠా సభ్యులు ఏకంగా 80 మంది యువకులను నమ్మించారు.

ఇదంతా నిజమే అనుకుని వాళ్లు వారి మాయలో పడిపోయారు. అయితే ఈ ప్రాసెస్ లో వారిని ఎన్నో రకాలుగా ట్రాప్ లోకి తెచ్చుకుని వారి నుంచి సుమారుగా రూ.5 కోట్ల వరకు వసూల్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక చివరికి మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే రాజస్థాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ నిందితులను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి