iDreamPost
android-app
ios-app

Free Electricity: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉచిత కరెంటు పథకం నిలిపివేత

  • Published Jul 24, 2024 | 9:13 AMUpdated Jul 24, 2024 | 9:13 AM

Rajasthan-Halts Free Electricity, Free Mobile Scheme: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉచిత కరెంటు హామీ అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు..

Rajasthan-Halts Free Electricity, Free Mobile Scheme: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉచిత కరెంటు హామీ అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు..

  • Published Jul 24, 2024 | 9:13 AMUpdated Jul 24, 2024 | 9:13 AM
Free Electricity: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉచిత కరెంటు పథకం నిలిపివేత

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమ కోసం అనేక రకాల పథకాలను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీల పేరిట అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, 2 లక్షల రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అలానే కేంద్ర ప్రభుత్వం కూడా పేదలకు ఉచిత రేషన్‌, అన్నదాతల కోసం 6 వేల రూపాయల పెట్టుబడి సాయం, ఉజ్వల స్కీమ్‌, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉచిత కరెంటు పథకాన్ని నిలిపివేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతోన్న సంగతి తెలసిందే. కొన్ని పార్టీలు సంక్షేమ పథకాలపై హామీ ఇచ్చి అధికారంలోకి వస్తే.. మరి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం.. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు.. అప్పటి వరకు ఉన్న సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా రాజస్తాన్‌లో ఇప్పటికే అమలు అవుతున్న ఉచిత కరెంటు పథకాన్ని రద్దు చేస్తూ.. బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

రాజస్తాన్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఓడించి.. విజయం సాధించి.. బీజేపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం.. భజన్‌లాల్ శర్మను రాజస్తాన్‌ ముఖ్యమంత్రిగా నియమించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అమలు చేసిన అనేక హామీలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రంలో అమలు అవుతున్న ఉచిత కరెంటు పథకాన్ని నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ శర్మ.. అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఉన్న లబ్ధిదారులకు ఉచిత కరెంటు హామీ అమలు కొనసాగిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇకపై కొత్తగా ఈ పథకం కింద దరఖాస్తులను స్వీకరించడం నిలిపివేస్తామని చెప్పుకొచ్చారు.

గతంలో రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న అశోక్ గెహ్లాత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఇంటికి నెలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసే పథకాన్ని ప్రారంభించింది. అంతేకాకుండా ఉచిత స్మార్ట్ ఫోన్ పథకాన్ని కూడా తీసుకురాగా.. తాజాగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. ఆ రెండు పథకాలను రద్దు చేసింది. 2023 జూన్ నుంచి 2024 మార్చి వరకు ఈ ఉచిత విద్యుత్ పథకానికి 98.23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది.

జనధార్‌తో లింక్ అయన డొమెస్టిక్ కనెక్షన్స్‌కు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు వర్తిస్తాయని రాజస్తాన్‌ ఇంధన శాఖ మంత్రి తెలిపారు. ఇందులో నమోదు చేసుకోని వినియోగదారులు పథకానికి అనర్హులు అవుతారని వారికి ఉచిత కరెంట్ రాదని స్పష్టం చేశారు. అంతేకాక ఇక నుంచి ఈ పథకం కింద ఎలాంటి కొత్త దరఖాస్తులను స్వీకరించమని తేల్చి చెప్పారు. అలానే ఉచిత స్మార్ట్‌ ఫోన్‌ పంపిణీని కూడా రద్దు చేయనున్నట్లు ప్రకటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి