iDreamPost

టెన్త్ టాపర్ గా నిలిచినా.. వెక్కిరింతలు! ఏమి మనుషులు వీళ్ళు? ఇంత దారుణమా?

Tenth Topper Prachi Nigam: ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ గా నిలిచింది. కానీ, ఆమె ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను చూపుతూ.. ఆమెను ట్రోల్ చేయడం చేశారు.

Tenth Topper Prachi Nigam: ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ గా నిలిచింది. కానీ, ఆమె ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను చూపుతూ.. ఆమెను ట్రోల్ చేయడం చేశారు.

టెన్త్ టాపర్ గా నిలిచినా.. వెక్కిరింతలు! ఏమి మనుషులు వీళ్ళు? ఇంత దారుణమా?

ప్రస్తుతం ఎక్కడ చూసినా పదో తరగతి ఫలితాల సందడి నెలకొంది. విద్యార్థులంతా తమ రిజల్ట్స్ చూసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక అమ్మాయి మాత్రం స్టేట్ టాపర్ గా నిలిచినా కూడా నెట్టింట ట్రోలింగ్ తప్పడం లేదు. ఆమె ముఖంపై అవాంఛిత రోమాలు ఉన్నాయని.. మీసాలు, గడ్డం ఉండటంతో ఆమెను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. వయసులో చిన్న అమ్మాయి, ఎంతో కష్టపడి స్టేట్ టాపర్ అయ్యిందని కూడా లేకుండా ఆమెను ట్రోలింగ్ చేశారు. అయితే ఈ సమాజంలో అంతా చెడే కాదు.. కాస్తో కూస్తో మంచి కూడా ఉంది. ఇప్పుడు నెట్టింట ఆమెకు మద్దతు పెరుగుతోంది. ట్రోల్ చేసే వారికి నెటిజన్స్ గట్టి కౌంటర్ ఇస్తున్నారు.

ఈ అమ్మాయి పేరు ప్రాచీ నిగమ్. ఈమె ఇటీవల విడుదలైన ఉత్తర ప్రదేశ్ బోర్డ్ పదో తరగతి పరీక్షల్లో స్టేట్ టాపర్ గా నిలిచింది. సీతాపూర్ కి చెందిన ప్రాచీ నిగమ్ 600 మార్కులకు గానూ.. 591 మార్కులు స్కోర్ చేసింది. అయితే ఆమె ముఖంపై ఉన్న అవాంఛిత రోమాల కారణంగా చాలా మంది ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆమె ఫొటోని ఎడిటింగ్ చేసి.. నానా రకాలుగా ట్రోల్ చేశారు. ఆమె ఎంతో కష్టపడి చదివి స్టేట్ టాపర్ గా నిలిచింది అనే కనీస భావన కూడా లేకుండా ట్రోల్ చేయడం చేశారు. ఆ పసి హృదయం ఎంత తల్లడిల్లుతుందో అనే ఆలోచన కూడా చేయకపోవడం దారుణం. ఒక అమ్మాయి తన ముఖం గురించి, తన లుక్స్ గురించి ఇంతలా ట్రోల్ చేస్తే ఎంత బాధ పడుతుందో అని కూడా ఎవరూ పట్టించుకోలేదు.

నిజంగా సమాజంలో ఇంత నీఛమైన బుద్ధి కలిగిన వాళ్లు, కుంచిత మనస్తత్వం కలిగిన వాళ్లు కూడా ఉంటారా? అనే ప్రశ్న ఎవరికైనా కలగకమానదు. అయితే ప్రాచీ నిగమ్ పై నెట్టింట ట్రోలింగ్ పెరగడంతో.. ఆమెకు మద్దతు తెలిపే వాళ్లు కూడా పెరిగారు. ప్రాచీ నిగమ్ కు శుభాకాంక్షలు తెలుపుతూనే.. ఆమెను ట్రోల్ చేసే వారికి సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. తాను స్టేట్ ఫస్ట్ సాధించిన తర్వాత ప్రాచీ నిగమ్ ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. తనపై జరుగుతున్న ట్రోలింగ్ ని కూడా ఆమె పట్టించుకోలేదు. చిన్న వయసులోనే ఎంతో హుందాగా ఆలోచించింది. ఆమె కుటుంబం కూడా సంబరాలు చేసుకున్నారు. తమ కుమార్తె స్టేట్ ఫస్ట్ రావడంపై ఆనందం వ్యక్తం చేశారు.

ప్రాచీనిగమ్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(PCOS)తో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. అంటే అండాశయాలు అసాధరణ మొత్తంలో ఆండ్రోజెన్స్, పురుషులలో ఉండో హార్మోనులను అధిక మొత్తంలో విడుదల చేస్తూ ఉంటాయి. ఈ కండిషన్ వల్ల చాలానే ఇబ్బందులు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ముఖంపై అవాంఛిత రోమాలు రావడం. ప్రస్తుతం ప్రాచీ నిగమ్ అలాంటి ఒక ఇబ్బందితోనే బాధ పడుతోంది. కానీ, అవేమీ పట్టించుకోని కొందరు ఆమెను ట్రోల్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. ఇప్పుడు ప్రాచీ నిగమ్ నెట్టింట మద్దతు పెరుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి