iDreamPost
android-app
ios-app

విషాదం: బ్యూటిఫుల్ బైకర్- ఇన్ ఫ్లుఎన్సర్ దుర్మరణం!

  • Published Jul 24, 2024 | 9:18 PM Updated Updated Jul 24, 2024 | 9:18 PM

Russian Influencer Beautiful Biker tatyana ozolina Passed Away: రష్యన్ బైకర్, సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుఎన్సర్ టాటాన్యా ఓజోలినా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ప్రపంచంలోనే ది మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్ గా ఆమె పేరు గాంచింది.

Russian Influencer Beautiful Biker tatyana ozolina Passed Away: రష్యన్ బైకర్, సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుఎన్సర్ టాటాన్యా ఓజోలినా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ప్రపంచంలోనే ది మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్ గా ఆమె పేరు గాంచింది.

  • Published Jul 24, 2024 | 9:18 PMUpdated Jul 24, 2024 | 9:18 PM
విషాదం: బ్యూటిఫుల్ బైకర్- ఇన్ ఫ్లుఎన్సర్ దుర్మరణం!

కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటు జీవితం. ఇది కేవలం సూక్తి మాత్రమే కాదు.. తప్పక ఒప్పుకోవాల్సిన సత్యం అని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా రోడ్డు ప్రమాదం అంటే ఒకరు మరణించడం కాదు.. ఒక కుటుంబం రోడ్డున పడటం. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ఒక బైకర్, ఇన్ ఫ్లుఎన్సర్ విషయంలో ఇదే జరిగింది. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉండి.. ఎంతోమందిని అలరించిన ఈ బ్యూటిఫుల్ బైకర్ ఇప్పుడు మన మధ్య లేదు. టర్కీలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ఇన్ ఫ్లుఎన్సర్ గురించే వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈమె పేరు టాట్యానా ఓజోలినా(38). ఈమె ఒక సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్. అలాగే మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్ గా పేరు గాంచిన రష్యన్ యువతి. బైక్ మీద ఎన్నో క్లిష్టమైన, కొన్నిసార్లు ప్రమాదకరంగా అనిపించిన వీడియోలు చేస్తూ ఉంటుంది. ఎన్ని వీడియోలు చేసినా పర్ఫెక్ట్ ప్రికాషన్స్, సేఫ్టీ మెజర్స్ తోనే చేస్తుంది. డ్రైవింగ్ సూట్, హెల్మెట్, లెగ్స్ కి- హ్యాండ్స్ కి ప్రొటెక్షన్ అన్నీ పెట్టుకుంటుంది. కానీ, ఈసారి అవన్నీ ఉన్నా కూడా కాపాడలేకపోయాయి. అంటే ఆ ప్రమాద తీవ్రత ఆ స్థాయిలో ఉంది. ఈమె ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ బైక్- ఒక ట్రక్కు ఢీకొనగా ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. తన బీఎండబ్ల్యూ బైక్ కంట్రోల్ కాక మిలాస్ సమీపంలో ట్రక్కును ఢీకొట్టినట్లు చెప్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by #мотоТаня❤️🖤#motoTanya (@tanechkaozolina)

ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ రైడ్ టాటాన్యానే కాకుండా.. మరో ఇద్దరు ఉన్నారంట. వారిలో ఒకరు టర్కిష్ బైకర్ ఒనుర్ ఒబుట్. అతను గాయాలతో బయటపడ్డాడు. మూడో బైకర్ మాత్రం క్షేమంగానే ఉన్నాడు. ఈ 38 ఏళ్ల బైకర్ టాటాన్యా ఓజోలినా మాత్రం అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాద సమయంలో ఆమె తన బీఎండబ్ల్యూ ఎ1000ఆర్ఆర్ 2015 మోడల్ బైక్ నడుపుతోంది. ప్రమాదంలో బైక్ కూడా బాగా డ్యామేజ్ అయ్యింది. ఫ్రంట్ మొత్తం ధ్వంసం అయిపోయింది. టాటాన్యా మరణవార్త తెలుసుకున్న నెటిజన్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఎన్నో అద్భుతమైన రీల్స్, తన బైక్ స్టంట్స్ తో అలరించేంది. అలాంటి యువతి కేవలం 38 ఏళ్ల వయసులోనే ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కలచి వేసిదంటూ కామెంట్స్ పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by #мотоТаня❤️🖤#motoTanya (@tanechkaozolina)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss