iDreamPost

‘కల్కి’ రిలీజ్ కు ముందు విదేశాలకు ప్రభాస్? కారణం ఏంటంటే?

కల్కి మూవీ రిలీజ్ కు ముందు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ప్రభాస్ నిజంగానే ఫారెన్ కు వెళ్తున్నాడా? వెళ్తే దానికి కారణం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

కల్కి మూవీ రిలీజ్ కు ముందు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ప్రభాస్ నిజంగానే ఫారెన్ కు వెళ్తున్నాడా? వెళ్తే దానికి కారణం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

‘కల్కి’ రిలీజ్ కు ముందు విదేశాలకు ప్రభాస్? కారణం ఏంటంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. దాంతో మూవీపై భారీగా హైప్ పెరిగింది. ముంబైలో ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. కల్కి రిలీజ్ కు ఇంకా 5 రోజులే టైమ్ ఉంది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. అదేంటంటే? డార్లింగ్ ప్రభాస్ మూవీ రిలీజ్ కు ముందు ఫారెన్ టూర్ కు వెళ్లబోతున్నాడట. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

సాధారణంగా స్టార్ హీరోలు సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక సరదాగా అలా విదేశాలకు వెళ్లి వెకేషన్ ను ఎంజాయ్ చేసొస్తుంటారు. మహేశ్ బాబు, తారక్, బన్నీ ఇలా హీరోలు సినిమాలు పూర్తి అయ్యాక లేదా షెడ్యూల్ గ్యాప్ వస్తే.. ఫారెన్ టూర్స్ వేస్తుంటారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కల్కి విడుదలకు ముందు డార్లింగ్ ఇలా ఫారెన్ టూర్ ఎందుకు వేస్తున్నాడా? అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే దీనికి పెద్ద కారణాలు ఏమీ లేనట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు షూటింగ్ లో అలసిపోయినందున కాస్త రిలాక్స్ అవుదామని డార్లింగ్ ఇలా విదేశాలకు వెళ్తున్నాడట. అంతే తప్ప మరే ఇతర కారణాలు లేవట. ఇక రెబల్ స్టార్ వెకేషన్ కోసం యూరప్ వెళ్తున్నాడట. గతంలో కూడా సలార్ మూవీకి ముందు ఇలాగే విదేశాలకు వెళ్లాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది గానీ.. నిజంగానే ప్రభాస్ ఫారెన్ కు వెళ్తున్నాడా? లేడా? అన్నది మాత్రం తెలియరాలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి