iDreamPost

16 ఏళ్ల తర్వాత నయనతారతో కలసి నటిస్తున్న ప్రభాస్.. ఏ సినిమాలో అంటే?

  • Author singhj Published - 09:49 PM, Sat - 23 September 23
  • Author singhj Published - 09:49 PM, Sat - 23 September 23
16 ఏళ్ల తర్వాత నయనతారతో కలసి నటిస్తున్న ప్రభాస్.. ఏ సినిమాలో అంటే?

సిల్వర్​స్క్రీన్​పై కొన్ని క్రేజీ కాంబినేషన్లను మళ్లీ మళ్లీ చూడాలని అభిమానులు కోరుకుంటారు. తమకు ఇష్టమైన హీరో, హీరోయిన్ మళ్లీ కలసి నటిస్తే చూడాలని అనుకుంటారు. అలా ఫ్యాన్స్ చూడాలని కోరుకునే జంటల్లో రెబల్ స్టార్ ప్రభాస్-లేడీ సూపర్​స్టార్ నయనతార ఒకటని చెప్పొచ్చు. వీళ్లు కలసి నటించిన చిత్రం ‘యోగి’. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2007లో విడుదలైంది. సినిమా అంతగా ఆడకపోయినా నయన్-ప్రభాస్ జంట కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే ‘యోగి’ తర్వాత వీళ్లు మళ్లీ కలసి నటించలేదు. ఎట్టకేలకు వీళ్లు మళ్లీ కలసి వెండితెరపై వినోదాన్ని పంచనున్నారు.

హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్​గా రానున్న సినిమా ‘కన్నప్ప’. ఈ ఫిల్మ్​కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్టార్ ప్లస్ ఛానల్​లో ప్రసారమైన ‘మహా భారత్’ సిరీస్​ను తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’ను డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ఇప్పటికే పరోక్షంగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్​లో స్టార్ హీరోయిన్ నయనతార కూడా భాగం కానున్నారని తెలిసింది. వరుస చిత్రాలతో అలరిస్తున్న నయన్ ‘కన్నప్ప’ మూవీలో ఒక కీలకపాత్రలో కనిపించనున్నారట. ఇందులో నయనతార నటిస్తున్నారనే విషయాన్ని సీనియర్ నటి మధుబాల కన్ఫర్మ్ చేశారు.

‘నేను త్వరలోనే ‘కన్నప్ప’ మూవీ చేయనున్నాను. ఈ సినిమాలో ప్రభాస్, నయనతార కూడా ఉన్నారు’ అని ఒక వీడియోలో మధుబాలు చెప్పుకొచ్చారు. దీంతో 16 ఏళ్ల భారీ గ్యాప్ తర్వాత ఈ జోడీ మరోమారు తెర మీద కనిపించనుందని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ‘కన్నప్ప’లో ప్రభాస్, నయన్​లు శివపార్వతులుగా కనిపించనున్నారని టాక్. ఈ మూవీలో హీరోయిన్​గా తొలుత నుపుర్ సనన్​ను సెలెక్ట్ చేశారు. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. ఈ మూవీ షూటింగ్ మొత్తం న్యూజిలాండ్​లోనే జరపనున్నారు. సింగిల్ షెడ్యూల్​లో దీన్ని పూర్తి చేయనున్నట్లు మంచు విష్ణు ఇప్పటికే ప్రకటించారు. భారీ బడ్జెట్​తో పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాను ప్రముఖ నటుడు మోహన్ బాబు నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి: కంగనా గన్​మెన్స్​పై లారెన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి