iDreamPost

పవన్​ కల్యాణ్​కు విశాఖ పోలీసుల నోటీసులు!

  • Author singhj Published - 04:49 PM, Fri - 11 August 23
  • Author singhj Published - 04:49 PM, Fri - 11 August 23
పవన్​ కల్యాణ్​కు విశాఖ పోలీసుల నోటీసులు!

ఉత్తరాంధ్రలో వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు జనసేనాని పవన్ కల్యాణ్​. అయితే యాత్ర రెండో రోజే ఆయనకు పోలీసులు షాక్ ఇచ్చారు. పవన్​ కల్యాణ్​కు వైజాగ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా నిన్న విశాఖపట్నంలో జరిగిన సభలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు అన్నారు. ఈ యాత్రలో ఇకపై ఇలా రెచ్చగొట్టేలా వ్యవహరించకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు. బహిరంగ సభలో పవన్ కల్యాణ్ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు చెప్పారు.

వారాహి యాత్రలో పవన్ కల్యాణ్​ ఇలా వ్యవహరించకూడదని నోటీసుల్లో వెల్లడించారు పోలీసులు. ఈ మేరకు విశాఖ తూర్పు ఏసీపీ పవన్​కు నోటీసులు ఇచ్చారు. పవన్​ కల్యాణ్​కు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. రుషికొండలో ఆయన పర్యటనపై ఆంక్షలు విధించారు. జోడుగుళ్లపాలెం నుంచి ఎవర్నీ అనుమతించబోమని.. ర్యాడిసన్ బ్లూ హోటల్ నుంచి పవన్ కల్యాణ్​ వెహికిల్​కు అనుమతి ఉందన్నారు పోలీసులు. రుషికొండలోని నిర్మాణాల వద్దకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి అని పోలీసులు చెబుతున్నారు.

అయితే పవన్ కల్యాణ్​ రోడ్డు మార్గంలో అక్కడికి వెళ్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పోలీసులు స్పష్టం చేసినట్లు సమాచారం. పవన్ కల్యాణ్​ పర్యటన నేపథ్యంలో పోలీసులు రోడ్డపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. రుషికొండకు వెళ్లే రూట్​లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. రుషికొండ వద్ద రోడ్డుకు కుడివైపున వెళ్లొద్దని ఆంక్షలు విధించారు పోలీసులు. అక్కడ ఎడమవైపున మాత్రమే వెళ్లాలని షరతులు పెట్టారు. రుషికొండకు ఎదురుగా ఉన్న రోడ్డులో మాత్రమే పవన్​ వెళ్లాలని తెలిపారు. అయితే గీతం కాలేజీ దగ్గర మీడియాతో ఆయన మాట్లాడొచ్చని చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి