iDreamPost
android-app
ios-app

అంచనాలు అదుపులో పెట్టాల్సిందే

  • Published Feb 27, 2020 | 11:26 AM Updated Updated Feb 27, 2020 | 11:26 AM
అంచనాలు అదుపులో పెట్టాల్సిందే

రెండేళ్ళ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న పింక్ రీమేక్ షూటింగ్ మెట్రో స్పీడ్ లో జరుగుతోంది. ఇప్పటికే టాకీ పార్ట్ కీలక భాగం పూర్తయ్యిందని సమాచారం. త్వరలోనే ఫస్ట్ ఆడియో సింగల్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈలోగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రొడక్షన్ టీం కంటే యాక్టివ్ గా దీని తాలుకు అప్ డేట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో లైవ్ లో ఉంటున్నాడు. పవన్ ఫ్యాన్స్ సైతం తమన్ ను ఈ విషయంగా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రమోషన్ పరంగా దిల్ రాజు టీం ఇంకా రంగంలోకి దిగలేదు.

నిజానికి ఇదే సరైన స్ట్రాటజీ అనే చెప్పాలి. పింక్ ఒరిజినల్ వెర్షన్ చూసినవాళ్ళకు అందులో కమర్షియల్ అంశాలు లేవని తెలుసు. తమిళ్ లో అజిత్ చేసిన రీమేక్ నీర్కొండ పార్వైలోనూ ఒకటి రెండు తప్పించి మరీ ఎక్కువ మాస్ అంశాలు లేవు. కథకు ఆత్మగా నిలిచే కోర్ట్ డ్రామానే హై లైట్ అవుతుంది.

మరి ఇప్పుడీ లాయర్ సాబ్ లో ఎలాంటి మార్పులు చేశారనేది ఆసక్తికరంగా మారింది. హీరోయిజం యాంగిల్ లో కొన్ని ఎపిసోడ్స్ పెట్టినప్పటికీ వాటిని పబ్లిసిటీలో ఎక్కువగా వాడరట.

అనవసరంగా అంచనాలు పెంచేసి అవి కాస్త అందుకోలేకపోయినా ఫస్ట్ షో పూర్తవ్వగానే అవి నెగటివ్ టాక్ రూపంలో బయటికి వస్తాయి. ఒక్కసారి ఇలా జరిగిందంటే స్టార్ హీరో చిన్న హీరో అనే తేడా ఉండదు . సాయంత్రానికే కలెక్షన్స్ లో డ్రాప్ ఉంటోంది. ఈ నేపధ్యంలో హైప్ ని లో ప్రొఫైల్ లో మైంటైన్ చేస్తూ అవసరానికి తగ్గట్టు మాత్రమే బిల్డప్ ని సెట్ చేసే ప్లాన్ లో పిఆర్ టీం ఉన్నట్టు వినికిడి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పవన్ సరనస నటించే హీరొయిన్ పేరు కూడా ఇంకా వెల్లడించలేదు. త్వరలో విడుదల చేయబోయే ఆడియో సింగల్ సుద్దాల అశోక్ తేజ సాహిత్యంలో సిద్ శ్రీరామ్ పాడగా కంపోజ్ చేసినట్టుగా తెలిసింది. ఎమోషనల్ సాంగ్ గా ఉండబోతోందట.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom Girişenbet girişHoliganbet Giriş