iDreamPost

Pawan Kalyan: పవన్​పై బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. దూరంగా ఉంటానంటూ..!

  • Author singhj Published - 06:25 PM, Mon - 3 July 23
  • Author singhj Published - 06:25 PM, Mon - 3 July 23
Pawan Kalyan: పవన్​పై బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. దూరంగా ఉంటానంటూ..!

బండ్ల గణేష్.. తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గణేష్.. ఆ తర్వాత కాలంలో ప్రొడ్యూసర్​ అవతారం ఎత్తారు. నిర్మాతగా పలు సినిమాలు రూపొందించి తన అభిరుచిని చాటుకున్నారు. అయితే కొన్నాళ్లు టాలీవుడ్​కు దూరంగా ఉంటూ వచ్చారు బండ్ల గణేష్. కానీ సూపర్​స్టార్ మహేష్​ బాబు మూవీ ‘సర్కారు వారి పాట’తో రీఎంట్రీ ఇచ్చారాయన. ఆ చిత్రంలో దొంగ పాత్రలో నటించి ఆడియెన్స్​ను కడుపుబ్బా నవ్వించారు. దీంతో బండ్ల గణేష్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతారని అంతా భావించారు. కానీ ఆయన మాత్రం మూవీస్​కు దూరంగా ఉంటున్నారు.

సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న బండ్ల గణేష్.. అప్పుడప్పుడు మూవీ ఫంక్షన్లకు హాజరు అవుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఆయన తన మార్క్ డైలాగులతో అందర్నీ ఎంటర్​టైన్ చేస్తున్నారు. ముఖ్యంగా పవర్​స్టార్ పవన్ కల్యాణ్ నటించే మూవీ ఫంక్షన్స్​కు ఎక్కువగా అటెండ్ అవుతుంటారు బండ్ల గణేష్. అందులో పవన్​పై తనకు ఉన్న ప్రేమను చూపిస్తుంటారు. పీకేను పొగుడుతూ బండ్ల గణేష్ ఇచ్చే స్పీచ్​లు నెట్టింట బాగా వైరల్ అవుతుంటాయి. అలాంటి ఈ యాక్టర్, ప్రొడ్యూసర్ తాను విపరీతంగా అభిమానించే పవన్​ కల్యాణ్​పై మరోమారు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గురు పౌర్ణిమ సందర్భంగా బండ్ల గణేష్​ ఆసక్తికర ట్వీట్ చేశారు.

పవన్ అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నానని బండ్ల గణేష్ తెలిపారు. కసి, కృషితో పవన్ అన్నీ సాధిస్తారని తాను ఆశిస్తున్నట్లు ఆ ట్వీట్​లో ఆయన రాసుకొచ్చారు. పవన్ స్థాయి, స్థానం ఏంటో తనకు తెలుసునన్న బండ్ల గణేష్.. ఆయన పేరును వాడుకొని లబ్ధి పొందాలని ఎప్పుడూ అనుకోలేదని స్పష్టం చేశారు. వీలైతే పవన్​కు సాయంగా ఉంటానన్న బండ్ల గణేష్​.. కుదరకపోతే ఆయనకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు. ఈ ట్వీట్​పై నెటిజన్స్ ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. పవన్​పై ఉన్న ప్రేమను బండ్ల గణేష్ చూపించారని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం ఇకపై పవర్​స్టార్​కు తాను దూరంగా ఉంటానని బండ్ల గణేష్ హింట్ ఇచ్చారని చెబుతున్నారు. మరి.. పవన్​పై బండ్ల గణేష్​ చేసిన ఈ ట్వీట్​ మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి