బండ్ల గణేష్.. తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గణేష్.. ఆ తర్వాత కాలంలో ప్రొడ్యూసర్ అవతారం ఎత్తారు. నిర్మాతగా పలు సినిమాలు రూపొందించి తన అభిరుచిని చాటుకున్నారు. అయితే కొన్నాళ్లు టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ వచ్చారు బండ్ల గణేష్. కానీ సూపర్‌స్టార్ మహేష్ బాబు మూవీ ‘సర్కారు వారి పాట’తో రీఎంట్రీ ఇచ్చారాయన. ఆ చిత్రంలో దొంగ పాత్రలో నటించి ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించారు. దీంతో బండ్ల గణేష్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతారని అంతా భావించారు. కానీ ఆయన మాత్రం మూవీస్‌కు దూరంగా ఉంటున్నారు.
సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న బండ్ల గణేష్.. అప్పుడప్పుడు మూవీ ఫంక్షన్లకు హాజరు అవుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఆయన తన మార్క్ డైలాగులతో అందర్నీ ఎంటర్టైన్ చేస్తున్నారు. ముఖ్యంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించే మూవీ ఫంక్షన్స్‌కు ఎక్కువగా అటెండ్ అవుతుంటారు బండ్ల గణేష్. అందులో పవన్‌పై తనకు ఉన్న ప్రేమను చూపిస్తుంటారు. పీకేను పొగుడుతూ బండ్ల గణేష్ ఇచ్చే స్పీచ్‌లు నెట్టింట బాగా వైరల్ అవుతుంటాయి. అలాంటి ఈ యాక్టర్, ప్రొడ్యూసర్ తాను విపరీతంగా అభిమానించే పవన్ కల్యాణ్‌పై మరోమారు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గురు పౌర్ణిమ సందర్భంగా బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
పవన్ అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నానని బండ్ల గణేష్ తెలిపారు. కసి, కృషితో పవన్ అన్నీ సాధిస్తారని తాను ఆశిస్తున్నట్లు ఆ ట్వీట్లో ఆయన రాసుకొచ్చారు. పవన్ స్థాయి, స్థానం ఏంటో తనకు తెలుసునన్న బండ్ల గణేష్.. ఆయన పేరును వాడుకొని లబ్ధి పొందాలని ఎప్పుడూ అనుకోలేదని స్పష్టం చేశారు. వీలైతే పవన్‌కు సాయంగా ఉంటానన్న బండ్ల గణేష్.. కుదరకపోతే ఆయనకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై నెటిజన్స్ ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. పవన్‌పై ఉన్న ప్రేమను బండ్ల గణేష్ చూపించారని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం ఇకపై పవర్‌స్టార్‌కు తాను దూరంగా ఉంటానని బండ్ల గణేష్ హింట్ ఇచ్చారని చెబుతున్నారు. మరి.. పవన్‌పై బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
గురు పూర్ణిమ సందర్భంగా మా గురువుకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు.. మీరు మీలాగే ఉండాలి మీరు అనుకున్నవన్ని సాధించాలి. కసితో కృషితో మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. మీ స్థాయి ఏంటో? మీ స్థానం ఏంటో? తెలిసిన వాడిగా చెబుతున్న.. ఎప్పుడు ఏ విధంగా మీ కీర్తిని గానీ మీ పేరుని వాడుకొని లబ్ధి…
— BANDLA GANESH. (@ganeshbandla) July 3, 2023