iDreamPost
android-app
ios-app

మ‌రో మువీకి రెడీ అవుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్

  • Published Jan 25, 2020 | 2:03 AM Updated Updated Jan 25, 2020 | 2:03 AM
మ‌రో మువీకి రెడీ అవుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్

ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా ఉండే ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్ర‌మంగా టాలీవుడ్ కి ద‌గ్గ‌ర‌వుతున్నారు. వ‌రుస సినిమాల‌తో వేగం పెంచుతున్నారు. ఇప్పటికే పింక్ సినిమాతో రీ ఎంట్రీ ఖాయం అయ్యింది. గ‌త వారం ప్రారంభ‌మ‌యిన షూటింగ్ లో ఇప్ప‌టికే ప‌వ‌న్ పాల్గొంటున్నారు. ఆ సినిమా కోసం వేసిన ప్ర‌త్యేక సెట్ లో ప‌వ‌న్ షూటింగ్ చేస్తున్నారు. హిందీలో సూప‌ర్ హిట్ అయిన సినిమాలో అమితాబ్ పోషించిన పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమాను మే నెల‌లో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25 రోజుల షెడ్యూల్ ని సినిమా కోసం కేటాయించిన‌ట్టు చెబుతున్నారు. దానికి గానూ రూ.30 కోట్ల రెమ్యునేష‌న్ తీసుకున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల భోగ‌ట్టా.

అదే ఊపులో మ‌రిన్ని సినిమాల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిద్ధ‌మ‌వుతున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ఏక‌కాలంలో రెండు సినిమాల‌కు సిద్ధ‌ప‌డ‌డం విశేషంగా క‌నిపిస్తోంది. ఓవైపు జ‌న‌సేన పార్టీని బీజేపీతో ముడిపెట్టిన త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 2న అమ‌రావ‌తి రైతుల కోసం క‌వాతుకి సిద్ధ‌మ‌వుతున్న ప‌వ‌న్ దానిక‌న్నా ముందే ఈనెల 28న త‌న రీఎంట్రీలో రెండో సినిమాకు ముహూర్తం నిర్ణ‌యించుకున్నారు. క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. ఏఎం ర‌త్నం నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ సినిమా నిర్మాణంలో భాగంగా 40 రోజుల పాటు ఫారిన్ షెడ్యూల్ కూడా ఉంటుంద‌ని చెబుతున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగా ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాల్ షీట్స్ క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్టు స‌మాచారం. టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ లో ఉన్న స‌మ‌యంలో కూడా ఏక‌కాలంలో రెండు సినిమాల‌కు ఎన్న‌డూ సిద్ధంకాని ప‌వ‌న్ తొలిసారిగా పింక్ రీమేక్ లో ఉండ‌గానే మ‌రో సినిమాకు సిద్ధం కావ‌డం ఆస‌క్తిగా క‌నిపిస్తోంది.

రాజ‌కీయంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీద విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ప‌వ‌న్ సినిమా ప‌రంగంలో బిజీ అవుతున్న తీరు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ పాల‌న బాగా ఉంటే తాను పోయి సినిమాలు తీసుకుంటాన‌ని గ‌తంలో చెప్పిన ప‌వ‌న్ ఇప్పుడు అందుకు అనుగుణంగానే టాలీవుడ్ లో మ‌ళ్ళీ పాత ఇమేజ్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తుండ‌డం విశేషం.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş