iDreamPost

పాక్ బోర్డు తిప్పలు.. టీమ్ ఫ్లైట్ ఛార్జీల కోసం పాకులాట!

పాకిస్థాన్ ఏం చేసినా కూడా కాస్త వింతగానే ఉంటుంది. ఇప్పుడు కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒక కొత్త వాదనతో వార్తల్లో నిలుస్తోంది. మరి.. ఆ వాదన ఏంటి? అసలు ఫ్లైట్ ఛార్జీల కోసం తిప్పలు పడటం ఏంటో చూడండి.

పాకిస్థాన్ ఏం చేసినా కూడా కాస్త వింతగానే ఉంటుంది. ఇప్పుడు కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒక కొత్త వాదనతో వార్తల్లో నిలుస్తోంది. మరి.. ఆ వాదన ఏంటి? అసలు ఫ్లైట్ ఛార్జీల కోసం తిప్పలు పడటం ఏంటో చూడండి.

పాక్ బోర్డు తిప్పలు.. టీమ్ ఫ్లైట్ ఛార్జీల కోసం పాకులాట!

సాధారణంగా పాకిస్తాన్ దేశం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అయితే అందులో మంచి కంటే కూడా చెడే ఎక్కువగా ఉంటుంది. అలాగే క్రికెట్ కి సంబంధించి కూడా అలాంటే పరిస్థితే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆటతో కంటే కూడా ఏదొక లిటికేషన్ తోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఒక వింత వాదనతో పాక్ బోర్డు వార్తల్లో నిలిచింది. అలాగే అదే విషయంలో వైరల్ కూడా అవుతోంది. పాక్ బోర్డు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ను ఛార్టెడ్ ఫ్లైట్ ఛార్జెస్ కోసం డిమాండ్ చేస్తోంది. ఆసియా కప్ నిర్వహణ ఛార్జెస్ కి అదనంగా ఫ్లైట్ ఖర్చులు కూడా ఇవ్వాలంటూ పాకులాడుతోంది.

ఆసియా కప్పు 2023ని పాకిస్థాన్- శ్రీలంక దేశాలు కలిసి నిర్వహించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ లో భద్రతా కారణాల రీత్యా టీమిండియాని పంపబోమని బీసీసీఐ తేల్చి చెప్పడంతో హైబ్రిడ్ మోడల్ లో ఆసియా కప్పు 2023ని నిర్వహించారు. ఈ ఆసియా కప్పుని నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) 2,50,000 డాలర్లు, స్పాన్సర్ షిప్, టికెట్ల విక్రయాల్లో షేర్ ని ఇస్తోంది. అయితే వారికి ఛార్టెడ్ ఫ్లైట్ ఛార్జెస్ కూడా ఇవ్వాలంటూ పీసీబీ డిమాండ్ చేస్తోంది. నిజానికి హైబ్రిడ్ మోడల్ అయినా కూడా ఎక్కువ మ్యాచెస్ శ్రీలంకలోనే జరిగాయి. పాకిస్తాన్ లో కేవలం 4 మ్యాచెస్ మాత్రమే నిర్వహించారు. 4 మ్యాచెస్ కోసమే పీసీబీకి ఏసీసీ 2.5 లక్షల డాలర్లు, స్పాన్సర్ షిప్, టికెటింగ్ లో వాటాను ఇస్తుంది. అయితే పాక్ జట్టును శ్రీలంకకు తిప్పేందుకు పాక్ మేనేజ్మెంట్ ఒక లంక ఫ్లైట్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. 4 ఛార్టెడ్ ఫ్లైట్స్ ని 2,81,000 డాలర్లకు మాట్లాడుకున్నట్లు చెబుతున్నారు. ఆ మొత్తాన్ని టోర్నమెంట్ పూర్తైన తర్వాత చెల్లిస్తామని చెప్పినా కూడా ఆ సంస్థ పట్టుబట్టడంతో ముందే చెల్లించినట్లు చెప్పారు.

ఈ ఛార్టెడ్ ఫ్లైట్ టికెట్లను మొదట ఫ్యాన్స్ కి కూడా అమ్మేందుకు ఆలోచన చేశారంట. పాకిస్తాన్ నుంచి ప్లేయర్లతో పాటుగా ప్రేక్షకులను కూడా కొలంబో తీసుకెళ్లేందుకు వినియోగించాలని భావించారంట. కానీ, భద్రతా కారణాల రీత్యా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. మరోవైపు పాక్ బోర్డులో ఒక హోదా కలిగిన వ్యక్తి తమ కుటుంబాన్ని ఆ ఛార్టెడ్ ఫ్లయిట్ లో కొలంబో తీసుకెళ్లారు అంటూ విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఛార్టెడ్ ఫ్లైట్ ఖర్చులు కూడా తమకు చెల్లించాలంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. ఏసీసీని డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా.. ఏసీసీ కూడా ఈ విషయంలో గట్టి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేంటంటే.. టోర్నీ నిర్వహణ ఖర్చులు, స్పాన్సర్ షిప్, టికెంటింగ్ లో వాటా మాత్రమే ఇవ్వాలని ఏసీసీ నిర్ణయానికి వచ్చింది. మరి.. ఛార్టెడ్ ఫ్లయిట్ ఖర్చుల కోసం పాక్ బోర్డు పడుతున్న తిప్పలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి