iDreamPost
android-app
ios-app

గంగూలీతో పాక్‌ ప్లేయర్‌ను పోల్చిన పాకిస్థాన్ జర్నలిస్ట్‌! తిట్టిపోస్తున్న ఫ్యాన్స్‌!

  • Published Jul 23, 2024 | 7:34 PMUpdated Jul 23, 2024 | 7:34 PM

Sourav Ganguly, Pakistan, Farid Khan: భారత దిగ్గజ మాజీ కెప్టెన్‌, ప్రిన్స్‌ ఆఫ్‌ కోల్‌కత్తా, ఆఫ్‌ సైడ్‌ గాడ్‌ సౌరవ్‌ గంగూలీని ఓ పాక్‌ క్రికెటర్‌తో పాకిస్థాన్‌ జర్నలిస్ట్‌ పోల్చాడు. దీనిపై క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Sourav Ganguly, Pakistan, Farid Khan: భారత దిగ్గజ మాజీ కెప్టెన్‌, ప్రిన్స్‌ ఆఫ్‌ కోల్‌కత్తా, ఆఫ్‌ సైడ్‌ గాడ్‌ సౌరవ్‌ గంగూలీని ఓ పాక్‌ క్రికెటర్‌తో పాకిస్థాన్‌ జర్నలిస్ట్‌ పోల్చాడు. దీనిపై క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Jul 23, 2024 | 7:34 PMUpdated Jul 23, 2024 | 7:34 PM
గంగూలీతో పాక్‌ ప్లేయర్‌ను పోల్చిన పాకిస్థాన్ జర్నలిస్ట్‌! తిట్టిపోస్తున్న ఫ్యాన్స్‌!

టీమిండియాలో కొంతమంది లెజెండరీ క్రికెటర్లు ఉన్నారు.. వారి ఆటకు ఫిదా అవ్వడం, వారి ఘనతల గురించి చెప్పుకోవడం తప్పా.. వారిని వేరే వారితో కంప్యార్‌ చేస్తే భారత క్రికెట్‌ అభిమానులు అస్సలు ఒప్పుకోరు. అలాంటి క్రికెటర్లలో టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఒకడు. అలాంటి ప్లేయర్‌ను పాక్‌ బచ్చా క్రికెటర్‌తో పోల్చుతూ.. జర్నలిస్ట్‌ అని చెప్పుకునే ఓ పాకిస్థాన్‌ నెటిజన్‌ తాజాగా ట్విట్టర్‌లో ఒక ట్వీట్‌ చేశాడు. అంతే భారత క్రికెట్‌ అభిమానులు అతన్ని దారుణంగా తిట్టిపోస్తున్నారు. అసలు ఆ పాక్‌ జర్నలిస్ట్‌ ఎవరు? దాదాను ఏ పాక్‌ ప్లేయర్‌తో పోల్చాడో ఇప్పుడు చూద్దాం..

ఫరీద్‌ ఖాన్‌ అనే వ్యక్తి.. సౌరవ్‌ గంగూలీ, పాకిస్థాన్‌ క్రికెటర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ ఫొటోలు పెట్టి.. ఇద్దరిలో ఎవరు బెటర్‌ ప్లేయర్‌, నిజాయితీగా చెప్పండి అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌పై భారత క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు గంగూలీ గురించి, క్రికెట్‌ గురించి ఇతనికి ఏమైనా తెలుసా అంటూ మండిపడ్డారు. గంగూలీ అంటే కేవలం క్రికెటర్‌ మాత్రమే కాదు.. భారత క్రికెట్‌ తలరాత మార్చిన దిగ్గజ కెప్టెన్‌ అని, ఆస్ట్రేలియానే భయపెట్టిన ఆటగాడని, గాడ్‌ ఆఫ్‌ ది ఆఫ్‌సైడ్‌ అనే విషయాలు తెలుసుకోవాలని హితవు పలికారు.

అసలు.. గంగూలీ చేసిన హాఫ్‌ సెంచరీలన్ని మ్యాచ్‌లు కూడా ఆడని ఇమామ్‌ ఉల్‌ హక్‌ను ఏ విధంగా దాదాతో పోల్చుతావ్‌ అంటూ ఫరీద్‌కు గడ్డిపెడుతున్నారు. గంగూలీ తన కెరీర్‌లో 113 టెస్టుల్లో 42.17 యావరేజ్‌తో 7212 పరుగులు చేశాడు. అందులో 16 సెంచరీలు, 35 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే 311 వన్డేలు ఆడి 41.02 యావరేజ్‌తో 11363 పరుగులు చేశాడు. అందులో 22 సెంచరీలు, 72 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 15687 పరుగులు, 33 సెంచరీలు, 89 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. లిస్ట్‌-ఏలో 15622 పరుగులు, 31 సెంచరీలు, 97 హాఫ్‌ సెంచరీలు చేశాడు. ఇది ఒక బ్యాటర్‌గా గంగూలీ స్టాట్స్‌. ఇక బౌలింగ్‌లోనూ దాదా సత్తా చాటాడు.. టెస్టుల్లో 32, వన్డేల్లో 100 వికెట్లు సాధించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 167, లిస్ట్‌-ఏలో 171 వికెట్లు ఉన్నాయి గంగూలీ ఖాతాలో. అంతకుమించి.. టీమిండియాను అద్భుతమైన జట్టుగా మార్చిన కెప్టెన్‌.

ఇక ఈ బచ్చా క్రికెటర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌.. గంగూలీ కొట్టిన హాఫ్‌ సెంచరీలన్ని మ్యాచ్‌లు కూడా ఆడలేదు. 24 టెస్టుల్లో కేవలం 37.33 యావరేజ్‌తో 1568 పరుగులు, 72 వన్డేల్లో 3138 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 3, వన్డేల్లో 9 సెంచరీలు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి స్టాట్స్‌.. ఇండియాలో దేశవాళి క్రికెట్‌ ఆడే వందల మంది క్రికెటర్లకు ఉంటాయి. ఇలాంటి ఓ బచ్చా క్రికెటర్‌ను తీసుకొచ్చి.. గంగూలీతో పోల్చడమే కాకుండా.. మళ్లీ ఇద్దరిలో ఎవరు బెటర్‌ క్రికెటర్‌ అంటా.. ఇలా ట్వీట్‌ చేయడానికి కనీసం బుద్ధి ఉండాలని క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి