iDreamPost
android-app
ios-app

ప్రభాస్ కు జోడీగా పాకిస్తాన్ బ్యూటీ? డైరెక్టర్ ప్లానేంటో..

  • Published Jul 22, 2024 | 12:49 PM Updated Updated Jul 22, 2024 | 12:49 PM

Prabhas Fauji Latest News: ప్రభాస్-హనురాఘవపూడి దర్శకత్వంతో తెరకెక్కబోయే చిత్రానికి సంబంధి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఇందులో ప్రభాస్ కు జోడీగా పాకిస్తాన్ బ్యూటీ నటించబోతున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

Prabhas Fauji Latest News: ప్రభాస్-హనురాఘవపూడి దర్శకత్వంతో తెరకెక్కబోయే చిత్రానికి సంబంధి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఇందులో ప్రభాస్ కు జోడీగా పాకిస్తాన్ బ్యూటీ నటించబోతున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 22, 2024 | 12:49 PMUpdated Jul 22, 2024 | 12:49 PM
ప్రభాస్ కు జోడీగా పాకిస్తాన్ బ్యూటీ? డైరెక్టర్ ప్లానేంటో..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. లేటెస్ట్ గా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి 2898 ఏడీ మూవీతో బాక్సాఫీస్ అంతు చూశాడు డార్లింగ్. ఈ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం కూడా సాలిడ్ కలెక్షన్లతో థియేటర్ల దగ్గర సందడి చేస్తోంది. కాగా.. డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ రానుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఇందులో ప్రభాస్ కు జోడీగా పాకిస్తాన్ బ్యూటీని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ ఓ చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రావాల్సిన ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటంతో.. ఫౌజీ అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ కు సంబంధించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రభాస్ ఫౌజీ మూవీ కోసం పాన్ ఇండియా నటిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. అందులో భాగంగా పాకిస్తాన్ కు చెందిన బ్యూటీ సజల్ అలీని మూవీ మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక సజల్ అలీ బాలీవుడ్ లో ఓ చిత్రం చేసింది. దివంగత నటి శ్రీదేవి నటించిన ‘మామ్’ లో ఈ బ్యూటీ మెరిసింది. ఆ తర్వాత మరోమూవీలో నటించలేదు. ఇక ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో నటించే అవకాశం వచ్చింది. అయితే పాకిస్తాన్ బ్యూటీనే పెట్టడానికి కారణం ఏంటంటే?

ఫౌజీ మూవీ స్వాతంత్య్రానికి పూర్వం కథతో తెరకెక్కబోతోంది. అంటే అప్పుడు భారతదేశం పాకిస్తాన్ ఇంకా విడిపోలేదు. దాంతో ఇండో-పాక్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని అర్ధం అవుతోంది. అందుకే రియాలిటీ కోసం పాక్ నటిని తీసుకోవాలని మేకర్స్ ఆలోచన. ఇక డార్లింగ్ సైనికుడిగా కనిపించబోతున్నాడు.  ప్రేమకథలకు ఎమోషనల్ టచ్ ఇవ్వడంలో డైరెక్టర్ హనురాఘవపూడి సిద్ధహస్తుడు. ఆ విషయం సీతారామంతో ఫ్రూవ్ చేశాడు కూడా. మరి ఇప్పుడు ప్రభాస్ తో ఏం మ్యాజిక్ చేస్తాడో అని ఫ్యాన్స్ ఈగర్లి వెయిట్ చేస్తున్నారు. మరి ప్రభాస్ కు జోడీగా పాక్ బ్యూటీ నటిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet