Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌ను కూడా చేతబట్టాడు. అయితే కింగ్ ఎన్ని సాధించినా దండగేనని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ అంటున్నాడు.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌ను కూడా చేతబట్టాడు. అయితే కింగ్ ఎన్ని సాధించినా దండగేనని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ అంటున్నాడు.
Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌ను కూడా చేతబట్టాడు. కెరీర్ మొదట్లోనే అతడు వన్డే వరల్డ్ కప్-2011 గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ మెగాటోర్నీతో కోహ్లీ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత టీమ్‌లో మెయిన్ ప్లేయర్ రేంజ్‌కు చేరుకున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ జట్టును కెప్టెన్‌గా ముందుండి నడిపించాడు. దూకుడైన సారథ్యంతో ప్రత్యర్థి జట్ల వెన్నులో వణుకు పుట్టించాడు. ఇంత చేసినా మళ్లీ ప్రపంచ కప్‌ను అందుకోలేదు. అయితే అందని ద్రాక్షగా ఉన్న కప్పును ఇటీవలే ఒడిసిపట్టి సంతోషంలో మునిగిపోయాడు.
క్రికెట్లో లెక్కకు మిక్కిలి రికార్డులను తన పేరు రాసుకున్న కోహ్లీ.. పొట్టి కప్పు గెలిచి తన కెరీర్‌ను మరింత చిరస్మరణీయం చేసుకున్నాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మీద ఫోకస్ పెడుతున్నాడు. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్-2023 చేతి దాకా వచ్చి మిస్సైన నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో అయినా ఆ కలను నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు. సేమ్ టైమ్ ఫిట్నెస్ ఇలాగే మెయింటెయిన్ చేస్తూ వన్డే వరల్డ్ కప్-2027లోనూ ఆడాలని చూస్తున్నాడు. కోహ్లీ, రోహిత్ ఈ టోర్నీలో ఆడే ఛాన్స్ ఉందని ఇటీవల కొత్త కోచ్ గౌతం గంభీర్ కూడా అన్నాడు. ఇదిలా ఉంటే.. కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన కోహ్లీని పాకిస్థాన్ లెజెండ్ యూనిస్ ఖాన్ టార్గెట్ చేశాడు. విరాట్ ఎంత చేసినా వేస్ట్ అని.. అతడి కెరీర్లో ఒక వెలితి ఉందన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం విరాట్ పాకిస్థాన్‌కు రావాలని కోరాడు యూనిస్ ఖాన్. పాక్‌కు వచ్చి అతడు పరుగుల వరద పారించాలని, సెంచరీల మీద సెంచరీలు బాదాలని.. అప్పుడు అతడు నిజంగా గ్రేట్ ప్లేయర్ అని ఒప్పుకుంటానన్నాడు యూనిస్. ‘ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం కోహ్లీ మా దేశానికి రావాలి. ఇది మా అందరి కోరిక. అతడు కెరీర్లో ఎన్నో సాధించాడు. కానీ పాక్‌కు రాకపోవడం ఒక్కటే వెలితిగా ఉండిపోయింది. కాబట్టి పాక్‌కు వచ్చి అతడు పరుగులు చేయాలి, సెంచరీలు బాదాలి’ అని యూనిస్ చెప్పుకొచ్చాడు. మరో పాక్ దిగ్గజం షాహిద్ అఫ్రిదీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కోహ్లీ తమ దేశానికి వస్తే ఆతిథ్యం ఎలా ఉంటుందో చూపిస్తామన్నాడు. అయితే భద్రతాపరమైన కారణాలు, దౌత్యపరమైన ఇబ్బందులు, రెండు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్‌కు వెళ్లేందుకు బీసీసీఐ ఒప్పుకోవడం లేదు.
Younis Khan said – “It’s our wish Virat Kohli come to Pakistan for the Champions Trophy 2025. I think the only thing left for him is to come to Pakistan and score runs & centuries in Pakistan”. (News24). pic.twitter.com/UOl5K26cfR
— Tanuj Singh (@ImTanujSingh) July 24, 2024