వైఎస్సార్‌సీపీ దౌర్జన్యపూరితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తోందని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్సార్‌సీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి బీజేపీ–జనసేన ఉమ్మడి ప్రణాళిక విడుదల సందర్భంగా బీజేపీ నేతలతో కలసి పవన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
పోలీసులు, ఎన్నికల సంఘం తమ బాధ్యతలు సరిగా నిర్వర్తించలేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, బీజేపీ కార్యకర్తలు, నేతలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. కొంత మంది పోలీసులు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని జనసేనాని మండిపడ్డారు. ప్రజల మనస్సులను గెలుచుకుని ఎన్నికల్లో గెలవాలి కానీ నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం సరికాదని వైఎస్సార్‌సీపీకి హితవు పలికారు.
5748