జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన ఢిల్లీ పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితరులతో ఆయన సమావేశం అవుతారని వార్తలు వచ్చినా పవన్ ఇప్పటివరకూ అధికారికంగా ఎవరినీ కలవలేదు.
పవన్ ఆదివారం పూర్తిగా తాను బస చేసిన హోటల్‌కే పరిమితమయ్యారని సమాచారం. అమిత్ షా మధ్యప్రదేశ్ పర్యటనతో పాటు డిల్లీ ఎన్నికల హడావుడిలో ఉన్నారు. మరోవైపు బీజేపీ అగ్రనేతలు డిల్లీ అభ్యర్థుల ఎంపికపై కోర్ కమిటీ సమావేశంలో బిజీగా ఉన్నారు. దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ నేడు డిల్లీకి చేరుకోనున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలపై మరో ప్రధాన కార్యదర్శి సంతోష్ కూడా ఏమాత్రం తీరికలేకుండా ఉన్నారట.. దీంతో పవన్ ఆర్ఎస్ఎస్ నేతలను కలిసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఓవైపు గోప్యత పాటిస్తూ బీజేపీ అగ్ర నేతలను కలిసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నా అవకాశం దక్కలేదు. సోమవారం అయినా జనసేనాని భేటీలు జరుగుతాయా లేదా నిరాశతోనే వెనుతిరుగుతాడా అనేది చూడాలి.
3803