ఓ వైపు కరోనా కేసులు ఐదు లక్షలు దాటాక మరణాల సంఖ్య 15 వేలకు దగ్గరగా ఉన్నది. ఈ నేపథ్యంలో ”ఎవరు ఏమనుకున్నా మాకేంటీ మాకు బీహార్ గద్దెపైనే దృష్టి” అన్నట్టుగా మోడీ,అమిత్ షాలు వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ కేంద్రంలో ఉన్న బిజెపి పెద్దలకు మాత్రం త్వరలో బీహార్‌లో జరగబోయే ఎన్నికలవైపే దృష్టి పెట్టారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను గద్దెదింపటానికి బిజెపి చేసిన ప్రయత్నాలు అన్నీ […]
ఉత్తరభారత దేశ పార్టీగా ముద్రపడిన భారతీయ జనతాపార్టీ(బీజేపీ) దక్షిణాధిలో పాగా వేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటక మినహా మరే రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చే బలం లేదు. 2014లో దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత కేంద్రంలో స్వంత బలంతో ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అదీ బీజేపీ కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ రెండు పర్యాయాల పాలనలో కుంభకోణాలు, మోడీ ఛరిష్మాతో బీజేపీ తన మిత్రపక్షాలపై అధారపడకుండా 282 సీట్లలో కేంద్రంలో కూర్చుకుంది. […]
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వార్ నడుస్తుంది. ఇండియా-చైనా సరిహద్దు గాల్వన్ లోయలో జరిగిన ఘటన నేపథ్యంలో వారిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా వాగ్వాదానికి దిగారు. భారత భూభాగాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనాకు అప్పగించారంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘాటుగా స్పందించారు. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొన్న వేళ రాహుల్ వ్యవహరిస్తున్న […]
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు ఎంత ప్రయత్నించినా ఫలితాలు రావడం లేదు. ముఖ్యంగా కేంద్రం కనికరం కూడా ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరికి ఎంతో ప్రయాసపడిన తర్వాత ఒక్కసారి మోడీ నుంచి ఫోన్ కాల్ రావడంతోనే ఆయన పెద్దగా ప్రచారం చేసుకునే వరకూ వచ్చింది. అంతేగాకుండా తాజాగా తాను మోడీకి వ్యక్తిగతంగా విరోధిని కాదని, ఆయన్ని ఎన్నడూ కించపరచలేదని కూడా చంద్రబాబు చెప్పుకున్నారు. అయినా ఇప్పటి వరకూ ఆశించినట్టుగా జరగడం లేదు. ఓవైపు ఏపీలో పాలక […]
పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య తరచుగా మాటల యుద్ధం నడుస్తుంది. కరోనా కేసుల సంఖ్యను బెంగాల్ తక్కువగా చూపిస్తుందని అమిత్ షా ఆరోపిస్తే, కేంద్రం విధించిన లాక్డౌన్ వలన తాము ఆర్థికంగా నష్టపోయినట్లు సీఎం మమత ప్రత్యారోపణలతో విరుచుకుపడింది. తాజాగా 13 గుర్తు తెలియని మృతదేహాల దహన సంస్కారాలకు సంబంధించి వైరల్‌గా మారిన ఒక వీడియో […]
ప్రచారాన్ని ప్రారంభించిన రాజకీయ పార్టీలు-నేడు అమిత్ షా డిజిటల్ ర్యాలీ బీహార్‌లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఆ రాష్ట్రంలో ఎన్నికల సమరం ప్రారంభమైంది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు తమ తమ ఎన్నికల వ్యూహలతో ముందుకు వెళ్తున్నారు. బిజెపి తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిజిటల్ ర్యాలీ నిర్వహించనున్నారు. దీంతో రాజకీయ నాయకుల్లో ఆత్రుత మొదలైంది. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో జెడియు అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో కలిసి […]
దేశంలో కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పని ప్రదేశాల్లో ఉపాధి లేకపోవడంతో ఆహారం, షెల్టర్‌కు నోచుకోలేకపోవడంతో తమ స్వస్థలాలకు కాలి నడకన వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిపై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వలస కార్మికులు ఓపిక పట్ట లేకనే కాలినడకన ఇళ్లకు బయలు దేరారనని పేర్కొన్నారు. అమిత్ షా ఒక జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా వలస కార్మికులు క్షేమంగా […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఈ రోజు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అవుతారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే చివరి నిమిషంలో సీఎం జగన్ పర్యటన వాయిదా పడింది. కరోనా కష్టకాలంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం జగన్ భావించారు. […]
ఏపీ ముఖ్యమంత్రి మరోసారి హస్తినకు వెళుతున్నారు. లాక్ డౌన్ కారణంగా మూడు నెలల విరామం తర్వాత జగన్ ఢిల్లీ పయనం అవుతున్నారు. గతంలో ఫిబ్రవరి చివరి వారంలో జగన్ రెండు సార్లు ఢిల్లీ వెళ్లారు. తొలుత ప్రధానితోనూ, ఆ తర్వాత రెండో విడత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ కీలక భేటీలు నిర్వహించారు. పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. ఏపీకి రావాల్సిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించి ఆయన వినతిపత్రాలు కూడా సమర్పించారు. అదే […]
కరోనాను నియంత్రించడంలో ఉద్ధవ్ సర్కార్ విఫలమైందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నారాయణ రాణే వ్యక్తిగత వ్యాఖ్యలని, బిజెపి వ్యాఖ్యలు ఎంత మాత్రమూ కావని ఆయన తేల్చి చెప్పారు. కరోనా కట్టడిలో ప్రతి రాష్ట్రమూ ఇతోధికంగా, సమర్థవంతంగా తమ తమ పాత్ర నిర్వహించాయని ఆయన పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రే పాలన అనుభవ రాహిత్యంపై అడగ్గా…. ఇలాంటి విషయాలు మాట్లాడడానికి అసలు […]