iDreamPost
android-app
ios-app

గీతా మేడంకు మెగా ఛాన్స్ ?

  • Published May 01, 2020 | 12:38 PM Updated Updated May 01, 2020 | 12:38 PM
గీతా మేడంకు మెగా ఛాన్స్ ?

కన్నడ సుందరి రష్మిక మందన్నకు టాలీవుడ్ టైం చాలా బాగుంది. పూజా హెగ్డే తర్వాత టాప్ రేస్ లో ఉన్నది తనే. ఈ ఏడాది పట్టుమని మూడు నెలలు గడవకుండానే రెండు బ్లాక్ బస్టర్స్ అందుకుంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, నితిన్ భీష్మ రెండూ ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ గా నిలవడమే కాక కలెక్షన్స్ పరంగానూ టాప్ 3లో చేరిపోయాయి. అందుకే అమ్మడి డిమాండ్ మాములుగా లేదు. తాజాగా తనకు సంబంధించిన ఒక హాట్ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

దాని ప్రకారం ఆచార్యలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ పక్కన జోడిగా తననే ఎంచుకోబోతున్నట్టు టాక్. ఓకే చెప్పిందో లేదో తెలియదు కానీ ప్రతిపాదన వెళ్లిందట. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప కోసం చిత్తూరు యాసను ప్రాక్టీస్ చేసే పనిలో ఇంట్లోనే బిజీగా ఉన్న రష్మిక మందన్న ఫోన్ లోనే వీడియో కాల్స్ ద్వారా కథలు వింటోందని తెలిసింది. ఒకవేళ రామ్ చరణ్ సరసన అవకాశం అంటే మంచిదే. కాకపోతే సినిమా మొత్తం ఉండదు కాబట్టి ఆలోచిస్తుందేమో. మెగాస్టార్ సరసన నటించడం జరిగే పని కాదు కాబట్టి ఇలా చరణ్ తో జోడి కొడితే మెగా ఫ్యాన్స్ లోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడుతుంది.

ఇదంతా ఖరారు కావాలంటే లాక్ డౌన్ కాలం పూర్తవ్వాలి. అసలు ఆచార్యలో రామ్ చరణైనా ఉంటాడా లేదా అనేది రాజమౌళి ఆర్ఆర్ఆర్ షెడ్యూల్ మీద ఆధారపడి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టే అని వినికిడి. ఆచార్య ఇంకా సగానికి పైగా షూటింగ్ బాలన్స్ ఉంది. ఆగస్ట్ లేదా దసరాకు రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడది అంత సులువుగా జరిగే పనిలా కనిపించడం లేదు. చిరు సరసన ఆల్రెడీ కాజల్ అగర్వాల్ ఫిక్స్ అయ్యింది కాబట్టి ఇక చరణ్ కోసం రష్మిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే మంచి క్రేజీ కాంబో అవుతుంది. చూద్దాం

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbet güncel girişHoliganbet GirişMadridbetMadridbet giriş