iDreamPost
android-app
ios-app

Lenin: లెనిన్..నాగ్ బెస్ట్ ట్రయిల్ అనుకోవచ్చా?

  • Published Jul 07, 2026 | 11:22 AM Updated Updated Jul 07, 2026 | 11:22 AM

కొడుకు ను పైకి తీసుకురావాలని ఏ తండ్రికి అయినా వుంటుంది. నాగ్ లాంటి హీరోకి వుండడంలో ఆశ్చర్యం లేదు.

కొడుకు ను పైకి తీసుకురావాలని ఏ తండ్రికి అయినా వుంటుంది. నాగ్ లాంటి హీరోకి వుండడంలో ఆశ్చర్యం లేదు.

Lenin: లెనిన్..నాగ్ బెస్ట్ ట్రయిల్ అనుకోవచ్చా?

కొడుకు ను పైకి తీసుకురావాలని ఏ తండ్రికి అయినా వుంటుంది. నాగ్ లాంటి హీరోకి వుండడంలో ఆశ్చర్యం లేదు. అఖిల్ అక్కినేని అందంగా వుంటాడు. మంచి కలర్. మంచి ఒడ్డు పొడవు. చాలా మందికి గుర్తు వుండే వుంటుంది. అఖిల్ హీరోగా తొలిసారి తెరమీదకు వస్తున్నపుడు ఫ్యాన్స్ హడావుడి మామూలుగా జరగలేదు. మహేష్ బాబు కి పోటీ హీరో వస్తున్నాడు అని హడావుడి చేసారు ఆ రోజుల్లో. ఆ మాటకు వస్తే అందచందాల్లో మహేష్ బాబుకు తీసిపోడు అఖిల్.

కానీ అదేంటో అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. చేసిన సినిమాలు ఏవీ హిట్ కాలేదు. ఏజెంట్ సినిమా అయితే నిర్మాత, దర్శకుడు, బయ్యర్లు ఇలా అందరినీ మూలన పడేలా చేసింది. ఆ తరువాత రెండేళ్లు సైలంట్ గా వుండిపోయాడు అఖిల్. లెనిన్ అనే సినిమాతో ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోదలుచుకున్నాడు. ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది అన్న దాని వెనుక చిన్న ముచ్చట వుంది.

దర్శకుడు నందు తన తొలి సినిమా తరువాత రెండో సినిమాను సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో చేయాల్సి వుంది. ఆ మేరకు కథ రెడీ అయింది. ఈ కథ అఖిల్ కు వినిపించారు. నచ్చేసింది. నాగ్ దృష్టికి వెళ్లింది. అక్కినేని హీరోలకు విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు అచ్చి వచ్చాయి. అఖిల్ కు ఇప్పటి వరకు విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ లేదు..అందువల్ల దీన్ని ప్రెస్టీజియస్ గా తీసుకుని తానే నిర్మించాలనుకున్నారు నాగ్. దాంతో సాహు గారపాటి ఆ ప్రాజెక్ట్ ను అలా అప్పగించేసారు.

తరువాత నాగ్ నిర్మాణ బాధ్యతలు తాను చూసుకుంటూ, మార్కెటింగ్, పబ్లిసిటీ బాధ్యతలను సితార నాగవంశీకి అప్పగించారు. ఆ విషయంలో నాగవంశీ బాగా చేస్తారనే నమ్మకం వుండడంతో.నాగ్ మరో పని పెట్టుకోకుండా లెనిన్ విషయంలో ప్రతి చోటా ఇన్ వాల్వ్ అయ్యారు. క్వాలిటీ దగ్గర, ఖర్చు దగ్గర ఎక్కడా రాజీ పడలేదు. దాదాపు యాభై కోట్ల మేరకు ఖర్చు చేసారనే టాక్ వుంది. సినిమాలో బోలెడు మంది నటులు, క్వాలిటీ టెక్నీషియన్లు వున్నారు కనుక ఆ మేరకు అయి వుంటుందనే అనుకోవాలి.

ఇంటర్వూల్లో కూడా అఖిల్, నాగవంశీ ఈ సినిమా మీద, సబ్జెక్ట్ మీద నాగ్ పడిన శ్రమను చెప్పనే చెప్పారు. కొడుక్కు మంచి హిట్ ఇచ్చి తీరాలనే పట్టుదలతో నాగ్ చేస్తున్న ట్రయిల్ అని అనుకోవాలేమో ఇదంతా. సినిమా బాగా వచ్చింది, బాగుంటుంది అనే టాక్ ఇండస్ట్రీలో వుంది. ఇంటర్వూల్లో అఖిల్ కాన్పిడెన్స్ కూడా అదే రేంజ్ లో వుంది. ప్రస్తుతం సీజన్ కూడా బాగుంది. అందువల్ల నాగ్ ప్రయత్నం, అఖిల్ కోరిక రెండూ నెరవేరే అవకాశం కనిపిస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş