Chiranjeevi
దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఎవరైనా కూడా. అందుకే ఒక స్థాయికి వచ్చిన మన తెలుగు దర్శకులు తమ పలుకుబడిని, తమ తెలివితేటలను వ్యాపారంగా మార్చుకుంటున్నారు.
దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఎవరైనా కూడా. అందుకే ఒక స్థాయికి వచ్చిన మన తెలుగు దర్శకులు తమ పలుకుబడిని, తమ తెలివితేటలను వ్యాపారంగా మార్చుకుంటున్నారు.
Chiranjeevi
దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఎవరైనా కూడా. అందుకే ఒక స్థాయికి వచ్చిన మన తెలుగు దర్శకులు తమ పలుకుబడిని, తమ తెలివితేటలను వ్యాపారంగా మార్చుకుంటున్నారు. టాప్ లైన్ లోకి వచ్చిన తరువాత ఎలాగూ ఏడాదికి రెండేళ్లకు తప్ప ఓ సినిమా తీయడం కష్టం. ఈ లోగా ఏం చేయాలి. అందుకే రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. ఈ విషయంలో దర్శకుడు సుకుమార్ అందరికన్నా ముందు వున్నారు. ఆయన చాలా కాలం ముందే సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ స్టార్ట్ చేసారు. అప్పట్లోనే కుమారి 21 ఎఫ్ అనే సినిమాను తన సూపర్ విజన్ లో తీసారు.
ఆ తరువాత కొత్త దర్శకులు, తన అసిస్టెంట్ లు ఎవరైనా మంచి ప్రాజెక్ట్ తెస్తే, దాన్ని తన భరోసాతో, తన సూపర్ విజన్ తో, తన మాట వాడి నిర్మాతలను సెట్ చేసి, తెరకెక్కిస్తున్నారు. దానికి బదులుగా తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ను దానికి జత చేసి, ఎంతో కొంత లాభం తీసుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని మరింత స్పీడప్ చేసారు. తన భార్య నిర్మాతగా చిన్న సినిమా చేస్తున్నారు. తన బ్యానర్ లో వేరే వేరే ప్రాజెక్ట్ లు చేస్తున్నారు. సుకుమార్ బ్యానర్ యాడ్ అయిన వృషకర్మ విడుదలకు రెడీ అవుతోంది. సిద్దు జొన్నల గడ్డ హీరోగా తన సోదరుడి తనయుడి డైరక్షన్ లో సినిమా ప్లాన్ చేస్తున్నారు. నిర్మాతలు ధైర్యంగా ముందుకు వస్తారు. ఎందుకంటే అడుగు అడుగునా సుకుమార్ క్వాలిటీ చెక్ వుంటుంది. సూపర్ విజన్ వుంటుంది. ఆయనకు మంచి ఆదాయం వస్తుంది.
దర్శకుడు త్రివిక్రమ్ కూడా చాలా కాలం క్రితం తన స్వంత బ్యానర్ పెట్టి సినిమాలు చేద్దాం అనుకున్నారు. కానీ సితార సంస్థ తనతోనే అసోసియేట్ అయ్యేలా చేసుకుంది. ఫార్ట్యూన్ ఫోర్ అనే బ్యానర్ ఇప్పుడు సితార సంస్ధ నిర్మించే ప్రతి సినిమాకు అసోసియేట్ అయి వుంటుంది. లాభాల్లో వాటానా? లేదా ఇంత నిర్దిష్ట మొత్తం అనా అన్నది వాళ్లకే తెలిసిన సంగతి. మొత్తానికి త్రివిక్రమ్ బ్యానర్ ఏటా అయిదారు సినిమాలు సమర్పిస్తూ ఎంతో కొంత ఆదాయం సంపాదిస్తోంది.
అగ్రదర్ళకుడు రాజమౌళి దారి వేరు తను తీసే సినిమాల్లోనే తన ఆదాయం తెచ్చుకుంటారు. నిర్మాతలతో ఏ విధమైన డీల్ వుంటుంది అన్నది ఆయనకు, ఆయన నిర్మాతలకు తప్ప మరి ఎవరికీ తెలియదు. కానీ ఆయన సినిమాల ప్రొడక్షన్ మొత్తం ఆయన కుమారుడు కార్తికేయనే చూసుకుంటారు. మార్కెటింగ్ కూడా ఆయన కనుసన్నలలోనే జరుగుతుంది నిర్మాతకు ముందే ఇంత లాభం అని ఫిక్స్ చేసి, టోటల్ ప్రాజెక్ట్ రాజమౌళి టేకోవర్ చేస్తారని ఇండస్ట్రీలో టాక్. నిజమెంతో తెలియదు. నిజం ఎలా వున్నా తన ప్రాజెక్ట్ ల మీద రాజమౌళికి మంచి ఆదాయం వస్తుందనే అనుకోవాలి.
దర్శకుడు అనిల్ రావిపూడిది వేరే దారి. ఆయన ఒక్క నిమిషం వేస్ట్ చేయరు. టీవీ షో ల మీద టీవీ షో లు చేస్తుంటారు. అలా ప్రతి ఇంటి ప్రేక్షకుడికి ఆయన దగ్గర అవుతున్నారు. దాంతో పాటు వారానికి రెండు మూడు రోజులు వర్క్ చేయడం ద్వారా ఆదాయం తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు చేస్తున్న వెంకీ మామ సినిమా ప్రొడక్షన్ కూడా ఆయనే చూసుకుంటున్నారని టాక్. ఇంత మొత్తంలో సినిమా ఫినిష్ చేసి ఇస్తా అనే పద్దతిలో ఆయన ప్రాజెక్ట్ టేకప్ చేసినట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు రావిపూడి 25 నుంచి 30 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారని టాక్ వుంది.
దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా సినిమాలను తన బాధ్యతతోనే తీస్తారు. అంటే నిర్మాణం అంతా ఆయనే చూసుకుంటారు. నిర్మాత పెట్టుబడి పెడతారు. ఎగ్జిక్యూషన్ అంతా ప్రశాంత్ వర్మ దే. దాంతో పాటు వేరే సినిమాలకు తన దర్శకత్వ పర్యవేక్షణ, తన కథలు ఇవ్వడం ద్వారా ఆదాయం తెచ్చుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్ సినిమా విఎఫ్ఎక్స్, ఎడిటింగ్ ఇలాంటి సదుపాయాలున్న భారీ ఆఫీసు కూడా స్టార్ట్ చేసారు. అంటే ఆదాయం కూడా ఆయనకే.
ఇలా చాలా మంది దర్ళకులు ఓ స్థాయికి వచ్చాక వెబ్ సిరీస్ లు, కథలు, సూపర్ విజన్ ల పేరిట, సినిమాలు చేతిలో వున్నా, లేకున్నా ఆదాయం వుండేలా చూసుకుంటున్నారు.