Chiranjeevi
కథకులు, దర్ళకులు తమ తమ సబ్జెక్ట్ లు పట్టుకుని చాలా మంది హీరోల దగ్గరకు వెళ్తారు.
కథకులు, దర్ళకులు తమ తమ సబ్జెక్ట్ లు పట్టుకుని చాలా మంది హీరోల దగ్గరకు వెళ్తారు.
Chiranjeevi
కథకులు, దర్ళకులు తమ తమ సబ్జెక్ట్ లు పట్టుకుని చాలా మంది హీరోల దగ్గరకు వెళ్తారు. కొందరికి కథ నచ్చదు. కొందరికి నచ్చినా ఎందుకో సెట్ కాదు. ఆఖరికి ఎవరికో సెట్ అవుతుంది. అందుకే ఏ హీరో దగ్గరకు చేరాలని వుంటే అక్కడకు చేరుతుంది కథ అంటారు ఇండస్ట్రీ జనాలు. నిర్మాత అనిల్ సుంకర ప్రస్తుతం వడ్డీ కాసుల వాడు అనే సినిమా తీస్తున్నారు. మంచు మనోజ్ హీరో. ఆ సినిమా కథ వ్యవహారం ఇలాంటిదే.
మొదట ఆ కథ హీరో నాగశౌర్య దగ్గరకు వెళ్లింది. ఆయనకు నచ్చింది కూడా. ఎందకుంటే కాస్త సోషియో ఫాంటసీ టచ్, డివోషనల్ టచ్ వుంది ఆ కథకు. అందుకే నచ్చింది. కానీ ఆయన పంపిన నిర్మాతలకు, శౌర్యకు ఎందుకో టెర్మ్స్ అంత సెట్ కాలేదు. సినిమా బడ్జెట్, మార్కెట్ ఇలా లెక్కలు అన్నీ చూసుకుని, ఆగిపోయారు.
ఇప్పుడు అదే కథ అనిల్ సుంకర టేకప్ చేసారు. హీరోగా మంచు మనోజ్ ను తీసుకున్నారు. వడ్డీ కాసుల వాడు అంటే వెంకటేశ్వరస్వామి నే. ఆయన తన పెళ్లి కోసం అప్పు చేసి ఇప్పటికీ వడ్డీ కడుతున్నారు కుబేరుడికి అని అంటారు. ఆ పాయింట్ ను, మధ్యతరగతి జనాలు అప్పు చేసి వడ్డీలు కట్టే పాయింట్ ను జత చేసి అల్లుకున్న కథ ఇది.