రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 64 కొత్త కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం కరోనా మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. సోమవారం ఉదయం నాటికి కరోనా కేసుల సంఖ్య 415కు చేరినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది.
కేరళలో 64, ఢిల్లీలో 30, రాజస్థాన్‌లో 28, తెలంగాణ 27, ఉత్తరప్రదేశ్ 27,ఆంధ్రప్రదేశ్ లో 7, కర్ణాటక 27, గుజరాత్‌లో 18 మందికి వైరస్ సోకింది. కర్ణాటకలో కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రతీ జిల్లాలోనూ ఓ ఆసుపత్రిని కేటాయించింది కర్ణాటక ప్రభుత్వం. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులున్న 75 జిల్లాలను కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే..