iDreamPost

వీడియో: మహిళా ఎంపీ చోరీ.. CCTV ఫుటేజ్ రావడంతో..

MP Golriz Ghahraman: ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన పార్లమెంటు సభ్యురాలు దొంగతనం ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందుకు పర్యావసానంగా పదవికి రాజీనామా కూడా చేశారు.

MP Golriz Ghahraman: ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన పార్లమెంటు సభ్యురాలు దొంగతనం ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందుకు పర్యావసానంగా పదవికి రాజీనామా కూడా చేశారు.

వీడియో: మహిళా ఎంపీ చోరీ.. CCTV ఫుటేజ్ రావడంతో..

ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవకులుగా మాత్రమే కాకుండా ఆదర్శప్రాయంగా ఉండాలి. కానీ, ఈ మహిళా ఎంపీ మాత్రం ఎవ్వరూ చేయకూడని పని చేసి దొరికిపోయారు. ఆరోపణలు కాస్తా.. నిజం కావడంతో తప్పును ఒప్పుకోవడం మాత్రమే కాకుండా.. తన పదవికి రాజీనామా కూడా చేశారు. అయితే అందుకు తగిన కారణాలు, అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా వివరించారు. కానీ, కారణాలు ఏమైనా కూడా ఒక పార్లమెంట్ సభ్యురాలు వస్త్ర దుకాణంలో చోరీకి పాల్పడటాన్ని ప్రజలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఒక ఎంపీ ఎందుకు చోరీ చేశారు? ఆమెను ప్రేరేపించిన కారణాలు ఏంటో చూద్దాం.

దొంగతనం ఆరోపణలతో పదవికి రాజీనీమా చేసిన మహిళా ఎంపీ పేరు గోల్రీజ్. ఆమె ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మాజీ న్యాయవాది. న్యూజిల్యాండ్ ప్రభుత్వంలో న్యాయశాఖ పోర్ట్ ఫోలియోని నిర్వహించారు. అంతేకాకుండా న్యూజిల్యాండ్ గవర్నమెంట్లో పోర్ట్ ఫోలియో దక్కించుకున్న తొలి శరణార్థిగా గోల్రీజ్ 2017లో చరిత్ర సృష్టించారు. అయితే ఆమెపై ఒక్కసారిగా దొంగతనం ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. అయితే ఆమె ఒకటి కాదు ఏకంగా మూడుసార్లు దొంగతనానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆక్లాండ్, వెల్లింగ్టన్ లో ఉన్న దుకాణాల్లో చోరీలు చేశారంటూ విమర్శలు వచ్చాయి. ఆమె ఒక బొటీక్ ఉన్న వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఆవిడ డిజైనర్ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.

అలాంటి దొంగతనం ఆరోపణల నేపథ్యంలో తన పదవికి ఎంపీ గోల్రీజ్ రాజీనామా కూడా చేశారు. ఆ సందర్భంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పని ఒత్తిడే తనతో అలాంటి పని చేయించిందని వాపోయారు. అంటే దాదాపుగా ఆమె తన నేరాన్ని అంగీకరించారు. చాలామందిని బాధ పెట్టాను నన్ను క్షమించండి అంటూ వ్యాఖ్యానించారు. “ఎన్నికకాబడిన ప్రజా ప్రతినిధుల నుంచి ప్రజలు ఆశించే స్థాయిలో నా చర్యలు లేవు. ఈ విషయంలో నేను ఎలాంటి సాకులు చెప్పదలుచుకోలేదు. అసలు ఈ ప్రవర్తన ఏంటో నేను వివరించలేను. హెల్త్ చెకప్స్ తర్వాత నా పరిస్థితి బాలేదని అర్థమైంది. ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం సమర్దించదగినది కాదు. ఈ బిహేవియర్ ట్రామా, విపరీతమైన ఒత్తిడి కారణంగా జరిగినట్లు వైద్యలు తెలియజేశారు” అంటూ మహిళా ఎంపీ గోల్రీజ్ వ్యాఖ్యానించారు.

ఎంపీ గోల్రీజ్ వివాదంపో సొంత పార్టీ నేతలు కూడా స్పందించారు. గ్రీన్ పార్టీ సహ నాయకుడు జేమ్స్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటుకు ఎన్నికైన రోజు నుంచి గోల్రీజ్ పలు లైంగిక, శారీరక హింసకు సంబంధించిన బెదిరింపులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. చాలా సభ్యులు ఎదుర్కొన్ని ఒత్తిడి కంటే గోల్రీజ్ ఎక్కువగానే ఒత్తిడిని అనుభవించారని వెల్లడించారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రవర్తనే వస్తుందని వ్యాఖ్యానించారు. కొన్ని సోషల్ మీడియా బెదిరింపుల దృష్ట్యా ఆవిడ బయట మాత్రమే కాకుండా.. పార్లమెంటులో కూడా వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించుకునే పరిస్థితులు వచ్చాయని సొంతపార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. గోల్రీజ్ రాజీనామా సబబే అంటూనే సొంత పార్టీ నేతలు ఆమెకు తమ మద్దతును తెలియజేశారు. గోల్రీజ్ న్యూజిల్యాండ్ కు వచ్చిన ఒక ఇరాన్ శరాణార్థి కుటుంబానికి చెందిన మహిళ. మరి.. న్యూజిల్యాండ్ మహిళా ఎంపీపై వచ్చిన ఆరోపణలు, ఆవిడ రాజీనామా చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి