iDreamPost

పాకిస్థాన్‌ పరువు తీస్తున్న IPL అన్‌సోల్డ్‌ టీమ్‌! అంతా ఆర్మీ ట్రైనింగ్‌ దయా!

  • Published Apr 26, 2024 | 2:13 PMUpdated Apr 26, 2024 | 2:13 PM

PAK vs NZ: ఒక వైపు ఐపీఎల్‌ క్రికెట్‌ అభిమానులను ఊపేస్తుంటే.. మరో వైపు పాకిస్థాన్‌ను ఐపీఎల్‌ అన్‌సోల్డ్‌ టీమ్‌ వణికిస్తోంది. మరి ఆ ఐపీఎల్‌ అన్‌సోల్డ్‌ టీమ్‌ ఏంటి? పాక్‌ ఎందుకు ఓడిపోతుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

PAK vs NZ: ఒక వైపు ఐపీఎల్‌ క్రికెట్‌ అభిమానులను ఊపేస్తుంటే.. మరో వైపు పాకిస్థాన్‌ను ఐపీఎల్‌ అన్‌సోల్డ్‌ టీమ్‌ వణికిస్తోంది. మరి ఆ ఐపీఎల్‌ అన్‌సోల్డ్‌ టీమ్‌ ఏంటి? పాక్‌ ఎందుకు ఓడిపోతుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Apr 26, 2024 | 2:13 PMUpdated Apr 26, 2024 | 2:13 PM
పాకిస్థాన్‌ పరువు తీస్తున్న IPL అన్‌సోల్డ్‌ టీమ్‌! అంతా ఆర్మీ ట్రైనింగ్‌ దయా!

ఇండియన్‌ క్రికెట్‌ అభిమానుల దృష్టి మొత్తం ఐపీఎల్‌పైనే ఉంది. ఐపీఎల్‌లో మ్యాచ్‌లన్నీ హోరాహోరీగా సాగుతుండటంతో.. అంతా ఐపీఎల్‌ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. కానీ, మరో వైపు పాకిస్థాన్‌ జట్టును ఓ బీ టీమ్‌, ఐపీఎల్‌ అన్‌సోల్డ్‌ టీమ్‌ వణికిస్తోంది. ఇటీవల న్యూజిలాండ్‌ ఐదు టీ20 మ్యాచ్‌ సిరీస్‌ ఆడేందుకు పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లింది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. రెండో టీ20లో పాకిస్థాన్‌ విజయం సాధించడంతో ఈ సిరీస్‌ కంటే ముందు వాళ్లు తీసుకున్న ఆర్మీ ట్రైనింగ్‌ అద్భుతంగా పనిచేసిందని పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులు సంబరపడిపోయారు. అయితే.. పాకిస్థాన్‌ కండీషన్స్‌కు అలవాటు పడ్డ తర్వాత న్యూజిలాండ్‌ అసలు సిసలు ఆట చూపిస్తోంది.

రెండో టీ20లో ఓడిపోయిన తర్వాత.. అద్భుతంగా పుంజుకుని.. తర్వాత రెండు టీ20ల్లో విజయం సాధించింది. రావల్పుండిలో జరిగిన మూడో టీ20, అలాగే లాహోర్‌ వేదికగా గురువారం జరిగిన నాలుగో టీ20లో విజయ భేరి మోగించి.. సిరీస్‌లో 2-1తో లీడ్‌లోకి వచ్చింది. ఇక ఈ నెల 27న మిగిలి ఉన్న చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలిస్తే.. 3-1తో సిరీస్‌ వాళ్ల వశం అవుతుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌ టీమ్‌-బీ పిలవబడుతున్న జట్టుల చేతిలో సిరీస్‌ కోల్పోతే పాకిస్థాన్‌ జట్టుకు ఇంత కంటే అవమానం ఉండదు. కాగా, ఈ సిరీస్‌ మొదలైనప్పటి నుంచి రెండు టీమ్స్‌పై కూడా సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి. న్యూజిలాండ్‌ లాంటి మెయిన్‌ ప్లేయర్లు లేకుండానే పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లింది. ఎందుకంటే ఆ జట్టులోని స్టార్‌ ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో బిజీగా ఉన్నారు. అందుకే పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన న్యూజిలాండ్‌ టీమ్‌ను ఐపీఎల్‌ అన్‌సోల్డ్‌ టీమ్‌గా క్రికెట్‌ అభిమానులు పిలుస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆ టీమ్‌లో ఉన్న చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోలేదు.

IPL unsold team shaking Pakistan!

ఇక పాకిస్థాన్‌ను ఐపీఎల్‌ బ్యాన్డ్‌ టీమ్‌గా అభివర్ణిస్తున్నారు. 2009లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌ క్రికెటర్లను ఐపీఎల్‌లో ఆడకుండా నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో.. ఐపీఎల్‌ బ్యాన్డ్‌ టీమ్‌ వర్సెస్‌ ఐపీఎల్‌ అన్‌సోల్డ్‌ టీమ్స్‌ మధ్య టీ20 సిరీస్‌ అంటూ క్రికెట్‌ అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు. అయితే.. స్టార్‌ ప్లేయర్లు పూర్తి స్థాయి టీ20 ప్లేయర్లు లేకుండా వచ్చిన న్యూజిలాండ్‌పై కూడా పాకిస్థాన్‌ మెయిన్‌ టీమ్‌ గెలవలేకపోతుండటంతో పాక్‌ టీమ్‌పై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో ఆడుతున్న పాకిస్థాన్‌ రానున్న టీ20 వరల్డ్‌ కప్‌కు వెళ్తుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌ బీ టీమ్‌పై గెలవలేని జట్టు వరల్డ్‌ కప్‌లో హేమాహేమీ టీమ్స్‌కు ఏం పోటీ ఇస్తుంది అంటూ ఆ జట్టుపై వారి అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఐపీఎల్‌ అన్‌సోల్డ్‌ టీమ్‌గా ముద్ర పడిన న్యూజిలాండ్‌.. పాకిస్థాన్‌ టీమ్‌ను వారి సొంత గడ్డపైనే వణికిస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి