iDreamPost

చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ.. నాలుగు రోజులు భారీ వర్షాలు!

IMD Heavey Rain Alert To The States: ఎండలకు అల్లాడి పోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ అధికారులు గుడ్ న్యూస్ అందించారు. నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నట్లు వెల్లడించారు. పలు రాష్ట్రాలకు వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయంటున్నారు.

IMD Heavey Rain Alert To The States: ఎండలకు అల్లాడి పోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ అధికారులు గుడ్ న్యూస్ అందించారు. నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నట్లు వెల్లడించారు. పలు రాష్ట్రాలకు వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయంటున్నారు.

చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ.. నాలుగు రోజులు భారీ వర్షాలు!

దేశవ్యాప్తంగా భానుడి భగ భగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు చేరుతోంది. వృద్ధలు, పిల్లలు, గర్భిణిలు ఎండగా ఉన్నప్పుడు బయటకు రావొద్దంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ సూచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో భారత వాతావరణ శాఖ దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలకు వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. దాదాపు 4 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో అయితే వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉందంటున్నారు.

ఏ రాష్ట్రంలోనైనా గత వారం రోజులుగా పగటి పూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయి. తెల్లారిన కొద్దిసేపటికే సూర్యూడి తాపం అధికంగా ఉంటోంది. ముఖ్యంగా వడగలాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ హీట్ వేవ్స్ కే ఎక్కువ మంది వడ దెబ్బకు గురయ్యే ఆస్కారం ఉంది. అందుకే ఉద్యోగులు బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదిలా ఉంటే వాతారవరణ శాఖ చల్లని కబురు చెప్పింది. పలు రాష్ట్రాలకు ఉన్న వర్ష సూచనను వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈసారి రెండు తెలుగా రాష్ట్రాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. కానీ, ఉత్తర భారతంలో మాత్రం పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్, ముజఫరాబాద్, గిల్గిత్, బాల్టిస్తాన్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ అధికారులు హెచ్చరించారు.

Rain for 4 days

ఏప్రిల్ 26 నుంచి ఏప్రిల్ 29 వరకు ఈ ప్రభావం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అటు స్టేట్ అఫీషియల్స్ ను కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలంటూ హెచ్చిరించింది. జమ్ముకశ్మీర్, బాల్టిస్తాన్, లద్దాఖ్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ నెల 26 నుంచి 29 వరకు వర్షాలు కురుస్తాయన్నారు. ఉత్తరాఖండ్ లో ఏప్రిల్ 28- 29 రెండ్రోజులు వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే ఏప్రిల్ 29న హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఈ వర్షాలకు అనుగుణంగా ఉద్యోగులు కూడా వారి వారి జాగ్రత్తలో ఉండాలంటూ సూచించారు. ఎండలైనా, వానలైన ప్రజలు మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వర్షాలు కురిసిన తర్వాత ఎండలు మరింత పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అత్యవసరం అయితే బయటకు రావాలంటూ వైద్యులు సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి