iDreamPost

భారత్ నుంచి వెళ్లిపోతాం అంటున్న వాట్సాప్! అసలు ఏం జరిగిందంటే?

Wahtasapp To Delhi HC- Will Shut Down In India: ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. అదే చేయాల్సి వస్తే.. తాము ఇండియాలో తమ సేవలను నిలిపివేస్తామంటూ హెచ్చరించింది.

Wahtasapp To Delhi HC- Will Shut Down In India: ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. అదే చేయాల్సి వస్తే.. తాము ఇండియాలో తమ సేవలను నిలిపివేస్తామంటూ హెచ్చరించింది.

భారత్ నుంచి వెళ్లిపోతాం అంటున్న వాట్సాప్! అసలు ఏం జరిగిందంటే?

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు భారత్ లో కూడా మంచి ఆదరణ ఉంది. కోట్లలో యూజర్స్ కూడా ఉన్నారు. మెటా సంస్థకు ఇండియా బిగ్గెస్ట్ మార్కెట్ అనే విషయం అందిరికీ తెలిసిందే. ఇండియాలో అయితే వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ లేదు అనే పరిస్థితికి వచ్చేశారు. ఇప్పటికిప్పుడు వాట్సాప్ సేవలు బంద్ చేస్తే చాలా మందికి ఎలా మెసేజ్ చేయాలో కూడా తెలియదు. అలా ఎందుకు జరుగుతుందిలే అని లైట్ తీసుకోకండి. పరిస్థితి ఇప్పుడు అలాగే తయారవుతోంది. తాజాగా వాట్సాప్ సంస్థ తమను గనుక బలవంతం చేస్తే తాము ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిపివేస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

అసలు ఏం జరిగింది?:

న్యూ ఐటీ రూల్స్ 2021లోని 4(2) సెక్షన్ చట్టబద్ధతను సవాలు చేస్తూ ఇప్పటి మెటా సంస్థ(వాట్సాప్, ఫేస్ బుక్) దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఆ సంస్థలు 4(2) సెక్షన్ వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛ, యూజర్స్ ప్రైవసీకి ఆటంకం కలిగిస్తుందని ఆరోపించింది. సెండర్స్ లొకేషన్ ట్రేలసబిలిటీకి సంబంధించిన రూల్ ని అమెండ్ చేయాలంటూ వాట్సాప్ సంస్థ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సెక్షన్ ను సవాలు చేస్తూ వాట్సాప్, ఫేస్ బుక్ సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. విచారణలో వాట్సాప్ తరఫు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. “మా యూజర్స్ మేము అందిస్తున్న ఎండు టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ భద్రత హామీతోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన రూల్ ప్రకారం మేము ఆ ఎన్ క్రిప్షన్ నియమాన్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. మీరు గనుక అలా బలవంతం చేసి 4(2) అమలు చేయాల్సిందే అంటే మేము భారత్ నుంచి వెళ్లిపోతాం” అంటూ వాట్సాప్ సంస్థ తరఫు న్యాయవాది వెల్లడించారు. తదుపరి విచారణను ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేశారు.

సోషల్ మీడియాలో యాప్స్ లో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ఈ రూల్ ని తీసుకొచ్చారంటూ ఆరోపించారు. ఈ రూల్ అనేది యూజర్స్ ప్రైవసీ, గోప్యతకు వ్యతిరేకం అని వాదిస్తున్నారు. పైగా ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ విమర్శిస్తున్నారు. ఇలాంటి నిబంధన ప్రపంచంలో ఎక్కడా లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. అలాగే ఇదే జరిగితే తాము కోట్లాది మెసేజ్ లను కొన్నేళ్ల పాటు స్టోర్ చేయాల్సి ఉంటుందని వాపోయారు. 2021 ఫిబ్రవరిలో కేంద్రం కొత్త ఐటీ రూల్స్ ని ప్రవేశ పెట్టింది. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సంస్థలు ఈ రూల్స్ ని తప్పకుండా పాటించాలని క్లారిటీ ఇచ్చింది. అయితే అప్పుడే ఈ రూల్స్ పై పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు అయ్యాయి.

అన్నింటిని విడి విడిగా కాకుండా.. సుప్రీకోర్టు అన్ని పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. తాజాగా ఈ పిటిషన్లపై విచారణ జరిగిన ఢిల్లీ హైకోర్టు.. ఆగస్టు 14కు హియరింగ్ ని వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో చాలా మందిలో వాట్సాప్ సేవలు ఆపేస్తుందేమో అనే భయం పట్టుకుంది. గతంలో కేంద్రం వ్యక్తిగత సమాచారం నేపథ్యంలో టిక్ టాక్, డబ్ స్మాష్ వంటి యాప్స్ ను బ్యాన్ చేసింది. కానీ, వాట్సాప్ సేవలు నిలిపివస్తే.. స్వచ్ఛందంగా భారత్ సేవలు నిలిపివేసినట్లు అవుతుంది. మరి.. వాట్సాప్ సేవలు లేకపోతే జీవితాలు తారుమారు అవుతాయా? మీ అభిప్రాయాలను కామంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి