iDreamPost

Video: ఒకే మొక్కలో బంగాళదుంప, టమాటాలు.. ఇదేం పంటరా సామీ!

  • Published Feb 14, 2024 | 6:13 PMUpdated Feb 14, 2024 | 6:13 PM

సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో తరుచుగా దేశంలో ఏదో ఒక వింతలు విశేషాలనేవి వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి కూడా తాను సరికొత్త రీతిలో ఓ మొక్కను పరిచయం చేసి దానికి కొత్త పేరు పెట్టాడు. దీనిని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకి అదేమిటంటే..

సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో తరుచుగా దేశంలో ఏదో ఒక వింతలు విశేషాలనేవి వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి కూడా తాను సరికొత్త రీతిలో ఓ మొక్కను పరిచయం చేసి దానికి కొత్త పేరు పెట్టాడు. దీనిని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకి అదేమిటంటే..

  • Published Feb 14, 2024 | 6:13 PMUpdated Feb 14, 2024 | 6:13 PM
Video: ఒకే మొక్కలో బంగాళదుంప, టమాటాలు.. ఇదేం పంటరా సామీ!

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగం అనేది మరింత పేరగడంతో.. దేశంలోని ఎక్కడలేని వింతలు విశేషాలేనవి క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. అయితే ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను వినియోగించడంలో ప్రజలు కూడా మరింత అప్ డేట్ అయ్యారు. ఎవరికి నచ్చిన విధంగా వారు విన్యసాలు చేస్తూ.. తమ టాలెంట్ ను కనుబరుస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ గా నిలుస్తారు. మరి కొంతమంది అయితే సామాజిక మాధ్యమాన్నే వ్యాపారంగా మలుచుకుంటూ రకరకాల వీడియోలను చేస్తూ వైరల్ అవుతుంటారు. ఈ క్రమంలోనే చాలామంది సేంద్రియ పద్థతిలో కూరగాయలను, పళ్లను ఎలా పండిచుకోవాలో అనేది వీడియోలు చేస్తూంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వ్యక్తి సరికొత్త రీతిలో టామాటా పంటను పండించి కొత్త పేరును పెట్టాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

సాధారణంగా బంగాళాదుంప, టమోటా రెండు వేర్వేరు కూరగాయలు, అలాగే ఈ రెండు వేర్వేరు మొక్కల నుంచి ఉత్పత్తి అవుతాయి. అయితే బంగాళదుంపను హిందీలో ఆలూ అని, టమాటాను హిందీలో టొమాటో అని పిలుస్తారనే విషయం తెలిసిందే. కానీ, తాజాగా ఓ వ్యక్తి పండించే టామాటా పంటకు మాత్రం కొత్తగా పొమాటో అని పేరు పెడుతూ సరికొత్త మొక్కగా పరిచయం చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆ వ్యక్తి ఒక మొక్కకు అడుగున బంగాళదుంప ఉండగా.. మొక్క పైభాగంలో టమాటాలు కాచాయి అని దీని పేరు పోమాటో అని ఆ వీడియాలో చెబుతున్నాడు. అలాగే ఈ మొక్కతో రైతులకు ఏకకాలంలో రెట్టింపు దిగుబడి వస్తోందని కూడా విరిస్తున్నాడు.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా ఈ వీడియోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగే దీనిపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తూన్నారు. అందులో ఒకరు ఈ పద్థతితో రైతుల ఉత్పత్తి పెరిగి ఆదాయం పేరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలా ప్రకృతిని పాడు చేయకూడదని అంటుండగా.. ఇదేదో ఆలోచించాల్సిన విషయం అంటూ మరొకరు విస్మయంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మాత్రం వీడియోపై స్పందిస్తూ.. ఒక పక్క ప్రజలు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారని, మరో పక్క ఇలాంటి వింత వింత పనులు జరుగుతున్నాయని ఆవేదనగా రాశారు.

దీంతో పోమాటో మొక్కకు పండిన టమాటా బంగాళాదుంపలా రుచిగా ఉంటుందని ఒకరు కామెంట్ చేస్తే.. నేను టమోటాలు ఉపయోగించకుండా, పోమాటాలు ఉపయోగించకుండానే బంగాళాదుంప కూర చేయగలను మరో వ్యక్తి కామెంట్ చేశాడు. అయితే, ఏది ఏమైనా ఇది ఫేక్ వీడియో, ఇలాంటివి జరగదు, ఇదంతా కేవలం వ్యూస్‌ కోసం ఇలాంటి వీడియోలు తీస్తున్నారని మరొకరు రాశారు. దానికి జోమాటో అని పేరు పెట్టకపోవడం మంచిదని ఒకరు రాశారు. మొత్తానికి ఈ విచిత్ర మొక్కకు సంబంధించిన వీడియో @agrotill అనే ఖాతాతో షేర్ చేయగా, దీనికి ఇప్పటివరకు 7 మిలియన్ల కంటే ఎక్కువ మంది వీక్షించారు. మరి, ఈ కొత్త రకమైన పోమాటో మొక్కను కనిపెట్టి, పండించిన వ్యక్తి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Alen Joseph (@agrotill)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి