iDreamPost
android-app
ios-app

వీడియో: బిగ్ బాస్ లో బిగ్ ఫైట్.. కిచెన్ కోసం యువతుల యుద్ధం!

  • Published Jul 24, 2024 | 7:56 PM Updated Updated Jul 24, 2024 | 7:56 PM

Bigg Boss OTT Season 3- Shivani And Kritika Mallik Fight: బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 3లో ఆట కంటే యుద్ధాలే ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పటికే ఒకరిని కొట్టేసి ఆర్మాన్ మాలిక్ వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు అతని భార్య కృతిక మాలిక్ మరో యువతితో గొడవతో వార్తల్లో నిలిచింది.

Bigg Boss OTT Season 3- Shivani And Kritika Mallik Fight: బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 3లో ఆట కంటే యుద్ధాలే ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పటికే ఒకరిని కొట్టేసి ఆర్మాన్ మాలిక్ వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు అతని భార్య కృతిక మాలిక్ మరో యువతితో గొడవతో వార్తల్లో నిలిచింది.

  • Published Jul 24, 2024 | 7:56 PMUpdated Jul 24, 2024 | 7:56 PM
వీడియో: బిగ్ బాస్ లో బిగ్ ఫైట్.. కిచెన్ కోసం యువతుల యుద్ధం!

బిగ్ బాస్ కాన్సెప్ట్ కు పాన్ ఇండియా లెవల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.. వస్తూనే ఉంటుంది. ఏ భాషలో వచ్చినా కూడా ఈ రియాలిటీ షోకి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా హిందీలో అయితే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. అక్కడ మెయిన్ సీజన్స్ మాత్రమే కాకుండా.. ఓటీటీ సీజన్స్ ని కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే రెండు ఓటీటీ సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. ఇప్పుడు ఓటీటీ సీజన్ 3 జరుగుతోంది. అయితే అక్కడ తెలుగులో అంత పద్ధతిగా ఉండదు. ఇదిలో ఇలా కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు. ఇప్పటికే ప్రముఖ యూట్యూబర్ ఆర్మాన్ మాలిక్ ఒకరికిన కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమ్మాయిల వంతు.. వాళ్లు కూడా కొట్టుకున్నంత పని చేశారు.

హిందీ బిగ్ బాస్ అంటే మొదటి నుంచి కాస్త ఘాటుగా, వైలెంట్ గానే ఉంటుంది. అక్కడ తెలుగులో ఉన్నన్ని షరతులు ఉండవు. అంటే ఉంటాయి.. కానీ, వాటిని పాటించేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. అందుకు చాలానే ఉదాహరణలు చెప్పచ్చు. ఇప్పుడు ఏకంగా ఇద్దరు అమ్మాయిలు నువ్వెంతంటే నువ్వెంత అంటూ రెచ్చిపోయారు. ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చేసి.. కొట్టేసుకునేంత పని అయిపోయింది. ఆ ఫైట్ ని మిగిలిన కొందరు ఇంటి సభ్యులు ఆపాల్సి వచ్చింది. అప్పుడు బీప్ లు వేసుకునే డైలాగులు రావడం విశేషం. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కిచెన్ విషయంలో వాళ్లిద్దరు గొడవకు దిగారు.

శివానీ- కృతికల మధ్య ఈ గొడవ జరిగింది. శివానీ కూరగాయలు కోస్తుండగా.. కృతిక నువ్వు ఆ పని చేయద్దు అని చెప్పడంతో ఈ గొడవ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత కొట్టుకునేంత వరకు వెళ్లింది. శివానీ- కృతిక మొదట కేకలు వేసుకున్నారు. ఆ తర్వాత కృతిక మీద మీదకు వస్తోందని.. శివానీ ఆమెను వెనక్కి నెడుతుంది. శివానీ నెట్టిందని కృతిక ఇంకా గట్టిగా నెడుతుంది. ఇలా ఇద్దరూ తోపులాటకు వెళ్తారు. వారిని వారించిన ఇంటి సభ్యులు గొడవ ఆపాలని సూచించారు. కానీ, అప్పటికే జరగాల్సిన గొడవ జరిగిపోయింది. ఇప్పుడు ఈ వీడియోలు గత 24 గంటలుగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అంటూ డిబేట్లు కూడా పెట్టేస్తున్నారు. మరి.. ఈ ఎపిసోడ్ గనుక మీరు చూసుంటే.. ఎవరిది తప్పు అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. ఇంక తెలుగు బిగ్ బాస్ 8 విషయానికి వస్తే.. ఆగస్టు చివరి వారం లేదా.. సెప్టెంబర్ మొదటి వారంలో మొదలవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే దాదాపుగా కొందరిని కన్ఫామ్ కూడే చేశారు అంటున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş