iDreamPost

డైరెక్ట్ OTTలోకి బెస్ట్ కాప్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ.. భయపడటం కాదు.. పడి పడి నవ్వుతారు!

Nawazuddin Siddiqui Rautu Ka Raaz Movie: నవాజుద్దీన్ సిద్ధిఖీ అంటే పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ ఉంది. ఆయన ఎంచుకునే పాత్రలు చాలా కొత్తగా ఉంటాయి. అలాంటి ఒక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి ఒక పోలీసు అధికారిగా తన సత్తా చాటబోతున్నాడు.

Nawazuddin Siddiqui Rautu Ka Raaz Movie: నవాజుద్దీన్ సిద్ధిఖీ అంటే పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ ఉంది. ఆయన ఎంచుకునే పాత్రలు చాలా కొత్తగా ఉంటాయి. అలాంటి ఒక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి ఒక పోలీసు అధికారిగా తన సత్తా చాటబోతున్నాడు.

డైరెక్ట్ OTTలోకి బెస్ట్ కాప్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ.. భయపడటం కాదు.. పడి పడి నవ్వుతారు!

ఓటీటీలో మీకు చాలానే కాప్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలు ఉన్నాయి. ఒక్కో స్టోరీకి మీకు వణుకు పుడుతుంది. కొన్ని కాప్ స్టోరీల్లో అయితే అతీత శక్తులు కూడా ఉంటాయి. ఒంటరిగా చూడాలి అన్నా కూడా భయంగా ఉంటుంది. అయితే మీకోసం ఒక కామెడీ కాప్ స్టోరీ తీసుకొచ్చాం. ఇది ఎంత సీరియస్ మేటర్ అంటే.. మీరు అస్సలు నవ్వకుండా ఉండలేరు. పైగా ఇందులో చేసిన యాక్టర్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో చాలా ఫేమస్. ఆయన మరెవరో కాదు.. నవాజుద్దీన్ సిద్ధిఖీ. నవాజుద్దీన్ మూవీ అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. అది కూడా మీకు డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ ఎంత సీరియస్ గా ఉంటుందో.. మీరు అంత పగలబడి నవ్వుకుంటారు.

సాధారణంగా కాప్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ అంటే మీకు ఎక్కువ సీరియస్ గా ఉంటుంది. ఆ తర్వాత అందులో ఒక లవ్ యాంగిల్ అలా పెడతారు. కానీ, ఈ సినిమాలో మాత్రం అలా ఏం ఉండదు. అంత పెద్ద సీరియస్ మేటర్ కాదు.. అసలు లవ్ స్టోరీ కూడా ఉండదు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఫన్ క్రియేట్ చేయడానికి కమెడియన్స్ కూడా ఉండరు. అలాంటి ఒక సూపర్ కాప్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ ఆ మూవీకి సంబంధించి ట్రైలర్ తెగ వైరల్ అవుతోంది. ఆ మూవీ మరేదో కాదు.. ‘రౌతు కా రాజ్’. ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపిస్తాడు.

Rautu ka RAaz

ఈ మూవీ కథ విషయానికి వస్తే.. సీరియస్ గా సాగే కామెడీ మూవీ. నవాజుద్దీన్ సిద్ధిఖీ ఆ ఊరిలో సీఐగా పనిచేస్తూ ఉంటాడు. వారికి వాళ్లు అసలు పోలీసులు అనే విషయం కూడా గుర్తు ఉండదు. ఎందుకంటే అక్కడ అసలు వాళ్ల అవసరమే ఉండదు. ఎలాంటి గొడవలు జరగవు, దొంగతనాలు జరగవు, హత్యలు అయితే అసలు ప్రశ్నే లేదు. అక్కడి పోలీసులకు రికార్డులు రాయటం, శవాలు, హత్యలు, దొంగలు ఇలాంటివి చాలా కొత్త. అలాంటి చోట ఒక హత్య జరుగుతుంది. ఆ హత్యను ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో కూడా ఆ పోలీసులకు తెలియదు. అలాంటి చోట నవాజుద్దీన్ సిద్ధిఖీ.. అలాంటి లేజీ టీమ్ తో ఎలా కేసును సాల్వ్ చేశాడు అనేదే సినిమా. ఈ కథ వినడానికే కాదు.. చూడటానికి కూడా చాలా కొత్తగా ఉంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా జూన్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటన చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి