iDreamPost
android-app
ios-app

OTT Best Suspense Thriller: OTT లో రష్మీ గౌతమ్ నటించిన అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్.. అసలు మిస్ కాకండి!

  • Published Jun 25, 2024 | 8:07 PM Updated Updated Jun 25, 2024 | 8:07 PM

ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మరీ ఓల్డ్ మూవీ అయితే కాదు. అలా అని రీసెంట్ గా వచ్చింది కాదు. కానీ ఇందులో నటించిన యాక్టర్స్ మాత్రం అందరికి పరిచయమే. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మరీ ఓల్డ్ మూవీ అయితే కాదు. అలా అని రీసెంట్ గా వచ్చింది కాదు. కానీ ఇందులో నటించిన యాక్టర్స్ మాత్రం అందరికి పరిచయమే. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 25, 2024 | 8:07 PMUpdated Jun 25, 2024 | 8:07 PM
OTT Best Suspense Thriller: OTT లో రష్మీ గౌతమ్ నటించిన అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్.. అసలు మిస్ కాకండి!

కంటెంట్ బావుంటే కనుక.. సినిమా చిన్నది పెద్దది అని పట్టించుకోకుండా.. సినిమాను బాగా హిట్ చేసేస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇప్పటివరకు ఇలాంటి మ్యాజిక్ చాలా సినిమాలలో రిపీట్ అవుతూనే ఉంది. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్ లో కానీ ఓటీటీ లో కానీ వచ్చిన సినిమాలు , వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఇతర భాషలలో హిట్ అయినా సినిమాలు తెలుగులో రీమేక్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మరీ ఓల్డ్ మూవీ అయితే కాదు. అలా అని రీసెంట్ గా వచ్చింది కాదు. కానీ ఇందులో నటించిన యాక్టర్స్ మాత్రం అందరికి పరిచయమే. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్ వేసేయండి.

ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా పేరు “హాస్టల్‌ హుడగరు బేకాగిద్దారే” . ఇది ఓ కన్నడ మూవీ.. తెలుగులో ఈ సినిమాను హాస్టల్ బాయ్స్ పేరుతో డబ్బింగ్ చేశారు. ఇక ఈ సినిమాలో ప్రజ్వల్‌, మంజునాథ్‌ నాయక, రాకేష్‌ రాజ్‌కుమార్‌, శ్రీవత్స, తేజస్‌ జయన్న ముఖ్య పాత్రలలో నటించగా.. కన్నడలో రిషబ్‌ శెట్టి, రక్షిత్‌ శెట్టి, రమ్యలు గెస్ట్‌ రోల్స్‌ లో అలరించారు. ఇక తెలుగులో రిషబ్‌ శెట్టి, తరుణ్‌ భాస్కర్‌, రష్మీ గౌతమ్‌లు గెస్ట్ రోల్స్ లో కనిపించారు. కాగా ఈ సినిమాకు నితిన్‌ క్రిష్ణమూర్తి దర్శకత్వం వహించారు. దాదాపు ఓటీటీ లో వచ్చిన సినిమాలన్నిటిని ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. మరి ఈ సినిమాను కూడా దాదాపు అందరూ చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమా యూత్ కు ఖచ్చితంగా నచ్చేస్తుందని చెప్పి తీరాలి. ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. కొంతమంది కాలేజ్‌ స్టూడెంట్స్‌ తుంగ అనే బాయ్స్‌ హాస్టల్‌లో ఉంటూ ఉంటారు. వారిలో అజిత్‌ అనే కుర్రాడికి ఎప్పటికైనా డైరెక్టర్‌ కావాలని కలలు కంటూ ఉంటాడు. అయితే అతని కథలు సరిగ్గా లేవంటూ .. అతని ఫ్రెండ్స్ ఎప్పుడూ అతన్ని తిడుతూ ఉంటారు. మరో వైపు అజిత్‌ బ్యాచ్‌కు వార్డెన్‌కు మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అనుకోకుండా ఓ రోజు వార్డెన్‌ ఆత్మహత్య చేసుకుంటాడు. పైగా తన చావుకు అజిత్‌, అతని ఫ్రెండ్స్ ఏ కారణం అని సూసైడ్‌ నోట్‌ కూడా రాసిపెట్టి ఉంటాడు. దీంతో కేసు ఎక్కడ తమ మీదకు వస్తుందా అని వారంతా భయపడుతూ ఉంటారు. దీనితో ఆ డెడ్ బాడీని మాయం చేయాలనీ అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది ? అసలు ఆ వార్డెన్ సూసైడ్ నోట్ లో అతని పేరు రాసేంతల వారి మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి ? ఇందులో రష్మీ గౌతమ్ పాత్ర ఏంటి ? డైరెక్టర్ కావాలన్నా అతని కల నెరవేరిందా లేదా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.