iDreamPost

Zee5 Top 10 Movies: జీ 5 OTT లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 మూవీస్ లో.. మీరెన్ని చూశారు !

  • Published Jun 26, 2024 | 11:59 AMUpdated Jun 26, 2024 | 12:38 PM

Top 10 Best Telugu Movies in Zee5: ప్రతి వారం ఓటీటీ లో చాలానే సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇక ఆ సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అయినా కొన్ని రోజుల తర్వాత వాటిలో ఏ ఏ సినిమాలు ట్రెండింగ్ లో ఉన్నాయనే లిస్ట్ కూడా వచ్చేస్తుంది. మరి ఈ క్రమంలో జీ5 లో ఏమేం మూవీస్ ట్రెండింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఓటీటీ అనగానే అందరికి కొన్ని ఫిక్స్డ్ ప్లాట్ ఫార్మ్స్ ఏ గుర్తొస్తూ ఉంటాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ ఇలా వీటి గురించి మాత్రమే ఎక్కువగా చెప్తూ ఉంటారు. అయితే వీటి అన్నిటితో పాటు.. ఇంకా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి చాలానే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ రెడీ గా ఉన్నాయి. వాటిలో ఒకటి జీ 5. జీ5 కూడా ఈ మధ్య మంచి కంటెంట్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంది. రీసెంట్ గా జీ 5లో విడుదలైన పరువు వెబ్ సిరీస్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రతి వారం ఓటీటీ లో చాలానే సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇక ఆ సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అయినా కొన్ని రోజుల తర్వాత వాటిలో ఏ ఏ సినిమాలు ట్రెండింగ్ లో ఉన్నాయనే లిస్ట్ కూడా వచ్చేస్తుంది. మరి ఈ క్రమంలో జీ5 లో ఏమేం మూవీస్ ట్రెండింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఈ మధ్య కాలంలో జీ 5 లో కూడా దాదాపు అన్ని భాషల చిత్రాలు.. స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. తెలుగులో కూడా మంచి మంచి కథలతో ప్రేక్షకులను మెప్పించడానికి మేకర్స్ కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా అవి సక్సెస్ కూడా అవుతున్నాయి. మరి ఈ మధ్య కాలంలో జీ 5 ఓటీటీ లో రిలీజ్ అయినా సినిమాలలో ఏ ఏ సినిమాలు టాప్ 10 ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయో చూసేద్దాం.

1. లవ్ కీ అరెంజ్ మ్యారేజ్
2. స్వంతత్ర వీర్ సావర్కర్
3. సైలెన్స్ 2
4. బస్తర్
5. హనుమాన్
6. సైలెన్స్
7. టారోట్
8. ది కేరళ స్టోరీ
9. సామ్ బహదూర్
10 కాటేరా

ఇక ఈ టాప్ 10 సినిమాలలో .. ఒకేసారి టాప్ 3 లో సైలెన్స్ 2, టాప్ 6 లో సైలెన్స్ సినిమాలు ఉండడం విశేషం. నటుడు మనోజ్ బాజ్ పాయ్ నటించిన సూపర్ హిట్ మూవీ సైలెన్స్ కు సిక్వెల్ గా వచ్చిన సినిమానే సైలెన్స్ 2. సైలెన్స్ 2 సినిమా ఈ ఏడాదిలోనే వచ్చింది కాని.. మొదటి పార్ట్ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇక దాదాపు వీటిలో ప్రేక్షకులు అన్ని సినిమాలను చూసేసి ఉంటారు. అసలు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలంటే.. స్పైడర్ మ్యాన్ నటుడు జాకబ్ బాటలోన్ అలాగే మన తెలుగు నటి అవంతిక వందనపు నటించిన టారోట్ మూవీ. దానితో పాటు.. స్వాతంత్ర సమరయోధుడు సావర్కార్ వినాయక్ దామోదర్ జీవిత చరిత్రపై.. తెరకెక్కిన స్వంతత్ర వీర్ సావర్కర్ సినిమాలు అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలలో మీరు ఎన్ని సినిమాలను చూశారు. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి